మున్సిపల్ ఉద్యోగి మృతదేహం పట్ల అమానుషం
శ్రీకాకుళం జిల్లాలో హృదయవిదారకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. కరోనాతో చనిపోతే కనికరం చూపలేదు. కోవిడ్ సోకితే దరిచేరేవారే కరువయ్యారు. కనీసం కుటుంబసభ్యులు, బంధువులు ఎవరూ అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాలేదు. ఇక అధికారులు సైతం అమానుషంగా ప్రవర్తించి ఆ పెద్దాయనను జేసీబీలో తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లాలో హృదయవిదారకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. కరోనాతో చనిపోతే కనికరం చూపలేదు. కోవిడ్ సోకితే దరిచేరేవారే కరువయ్యారు. కనీసం కుటుంబసభ్యులు, బంధువులు ఎవరూ అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాలేదు. ఇక అధికారులు సైతం అమానుషంగా ప్రవర్తించి ఆ పెద్దాయనను జేసీబీలో తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటిలోని ఉదయపురానికి చెందిన ఓ వ్యక్తి స్థానిక మున్సిపాలిటీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. అయితే స్థానిక ఆరోగ్య సిబ్బంది చనిపోయిన ఆ వ్యక్తిని పరీక్షించి కరోనా వైరస్ లక్షణాలతో చనిపోయాడంటూ తేల్చి చెప్పారు. దీంతో అప్పటి వరకూ అక్కడే ఉన్న జనం పరుగులు తీశారు. కుటుంబసభ్యులతో సహా స్థానికులు అంతిమ సంస్కారాలు చేసేందుకు నిరాకరించారు. దీంతో వైద్యులు స్థానికులు నచ్చజేప్పేందుకు ప్రయత్నించారు. పీపీఈ కిట్ల ధరించి అంత్యక్రియలు నిర్వహించవచ్చని సూచించారు. అయినా ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. దీంతో స్థానిక మున్సిపల్ అధికారులు అతి దయనీయంగా మృతదేహాన్ని జేసీబీ వాహనంలో తరలించి దహన సంస్కారాలు పూర్తి చేశారు. అయితే, మున్సిపల్ అధికారులు ప్రదర్శించిన తీరుపట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు మృతుడి కుమారుడు స్పందిస్తూ తమ తండ్రి బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయినట్లు చెప్పారు. తమ తండ్రి కరోనా లక్షణాలు ఏమి లేవని.. స్థానిక అధికారులే అనవరసరంగా హడావిడి చేసి అంత్యక్రియలు చేసేందుకు అటంంకం కలిగించారని ఆరోపిస్తున్నారు.