AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐఎన్ఎస్ పరుందులో 30 మంది ఆఫీసర్స్‌కు కరోనా

దక్షిణ భారత దేశంలోనే అత్యధిక వైరస్ పాజిటివ్ కేసులు ఒక్క తమిళనాడులోనే నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే, నేవల్ ఏయిర్ స్టేషన్‌కు చెందిన ఐఎన్‌ఎస్ పరుందులో పని చేస్తున్న దాదాపు 30 మంది ఆఫీసర్స్‌కు కరోనా..

ఐఎన్ఎస్ పరుందులో 30 మంది ఆఫీసర్స్‌కు కరోనా
Jyothi Gadda
|

Updated on: Jun 26, 2020 | 7:22 PM

Share

భారత్‌‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని తమిళనాడుపై కరోనా కక్ష సాధిస్తున్నట్లు కనబడుతోంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. దక్షిణ భారత దేశంలోనే అత్యధిక వైరస్ పాజిటివ్ కేసులు ఒక్క తమిళనాడులోనే నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే, చెన్నై రామనాథపురంలోని నేవల్ ఏయిర్ స్టేషన్‌కు చెందిన ఐఎన్‌ఎస్ పరుందులో పని చేస్తున్న దాదాపు 30 మంది ఆఫీసర్స్‌కు కరోనా పాజిటివ్‌గా తేలిందని డిస్ట్రిక్ట్‌ అఫీషియల్స్ వెల్లడించారు. కానీ ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్‌ను ఆపరేషనల్‌గా ఉంచారని చెన్నైలోని డిఫెన్స్ వర్గాలు చెప్పిన సమాచారన్ని బట్టి తెలుస్తోంది.

ఇన్ఫెక్షన్ బారిన పడిన మృతి చెందిన వారి సంఖ్య 33 అని డిస్ట్రిక్ట్‌ ఆథారిటీస్ వెల్లడించింది. వారిలో కొందరు సెయిలర్స్‌తోపాటు కొత్తగా పోస్టింగ్ అయిన వాళ్లు ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం. ప్రొటోకాల్ ప్రకారం కొందరు అధికారులను క్వారంటైన్‌లో ఉంచగా,.. వారిలో కొందరికి పాజిటివ్‌గా వచ్చిందని తెలిసింది. ఐఎన్‌ఎస్ పరుందులో పని చేసే సివిలియన్ స్టాఫ్‌ ఎంట్రీని నిషేధించామని ఆయా వర్గాలు తెలిపాయి. నేవీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. పాల్క్ బే ఏరియాలో రెగ్యులర్‌‌గా రెస్క్యూ కవరేజీ చేయడంతోపాటు సెర్చ్ ఆపరేషన్స్ చేయడానికి ఐఎన్‌ఎస్ పరుందుకు సాయపడుతుంది. దీంతోపాటు కోస్టల్ లేదా ఏరియా సర్వైలెన్స్, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్‌ను ఒకే చోటకు చేర్చడం కూడా పరుందు చేసే ఆపరేషన్‌ టాస్క్స్‌గా చెప్పొచ్చు.

తమిళనాడులో రాష్ట్ర ప్రజలు కరోనా టెర్రర్‌తో హడలెత్తిపోతున్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70,977కు చేరింది. ఇక తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఏకంగా 47,650 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో ఇప్పటి వరకు కరోనా కాటుకు బలై 911 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Follow Us
మధుమేహం నియంత్రణలో ఉండాలంటే మీ టిఫిన్లో ఇది ఉండాల్సిందే!
మధుమేహం నియంత్రణలో ఉండాలంటే మీ టిఫిన్లో ఇది ఉండాల్సిందే!
తిన్న తర్వాత కడుపులో గడబిడా.. మీరు చేస్తున్న తప్పు ఇదే
తిన్న తర్వాత కడుపులో గడబిడా.. మీరు చేస్తున్న తప్పు ఇదే
గురు మంగళ యోగం ఎఫెక్ట్.. ఈ 3 రాశుల వారికి ఇక తిరుగుండదట! మీ రాశి
గురు మంగళ యోగం ఎఫెక్ట్.. ఈ 3 రాశుల వారికి ఇక తిరుగుండదట! మీ రాశి
బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డా, అవకాడోనా? మీ ఆరోగ్యాన్ని కాపాడేది ఇదే..
బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డా, అవకాడోనా? మీ ఆరోగ్యాన్ని కాపాడేది ఇదే..
IND vs AFG: ఆఫ్ఘాన్‌తో చివరి మ్యాచ్.. ఆ ముగ్గురు ఔట్..?
IND vs AFG: ఆఫ్ఘాన్‌తో చివరి మ్యాచ్.. ఆ ముగ్గురు ఔట్..?
ఆవు నెయ్యి vs గేదె నెయ్యి.. ఏది తింటే ఆరోగ్యానికి మేలు?
ఆవు నెయ్యి vs గేదె నెయ్యి.. ఏది తింటే ఆరోగ్యానికి మేలు?
వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు పిల్లలు మృతి
వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు పిల్లలు మృతి
జర్మన్ సిల్వర్ అని ఎందుకు అంటారు? పేరు వెనుక అసలు కథ ఇదే!
జర్మన్ సిల్వర్ అని ఎందుకు అంటారు? పేరు వెనుక అసలు కథ ఇదే!
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రద్దు..? ఐపీఎల్‌ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..!
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రద్దు..? ఐపీఎల్‌ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..!
ఉదయం లేవగానే నిమ్మరసం నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!
ఉదయం లేవగానే నిమ్మరసం నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!