AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షపు నీరు తాగితే శరీరానికి ఏమవుతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..

వర్షాకాలంలో చాలా మందికి వర్షపు నీటిని తాగే అలవాటు ఉంటుంది. అది నేరుగా ప్రకృతి నుండి వస్తుంది. కాబట్టి చాలా స్వచ్ఛమైనదని, ఆరోగ్యానికి మంచిదని కొందరు భావిస్తారు. అయితే, ఈ వర్షపు నీటిని తాగడం వల్ల అమృతం లాంటి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షపు నీటిని తాగడం నిజంగా సురక్షితమేనా? నిపుణులు ఏమంటున్నారో ఈ వానాకాలంలో తప్పక తెలుసుకోవాల్సిన విషయం..

వర్షపు నీరు తాగితే శరీరానికి ఏమవుతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..
Is Rainwater Safe To Drink
Jyothi Gadda
|

Updated on: Jul 15, 2026 | 3:02 PM

Share

చిన్నప్పుడు వర్షంలో తడుస్తూ, ఆకాశం వైపు ముఖం పెట్టి కురిసే వర్షపు చుక్కలను నేరుగా నోట్లోకి తీసుకోవడం మనలో చాలా మందికి అలవాటు ఉండే ఉంటుంది. ప్రకృతి నుంచి నేరుగా లభించే ఈ నీరు ఎంతో స్వచ్ఛమైనదని, అమృతం లాంటిదని కొందరు నమ్ముతారు. అయితే, ఈ అలవాటు మిమ్మల్ని హాస్పిటల్ పాలు చేసే ప్రమాదం ఉందని నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

కలుషితమయ్యే వర్షపు నీరు:

ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సంజయ్ వినాయక్ అభిప్రాయం ప్రకారం, వర్షపు నీరు సహజమైనదే అయినప్పటికీ, అది నేరుగా తాగడానికి ఏమాత్రం సురక్షితం కాదు. వర్షపు చుక్కలు ఆకాశం నుంచి భూమికి చేరే లోపు గాల్లో ఉండే కాలుష్యం, ధూళి కణాలు, హానికర బ్యాక్టీరియా, వైరస్‌లతో కలిసిపోతాయి. అందువల్ల వర్షపు నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మరిగించకుండా లేదా ఫిల్టర్ చేయకుండా తాగకూడదు. ముఖ్యంగా సీజన్‌లో పడే మొదటి వర్షపు నీటిని అస్సలు ముట్టుకోకూడదు, ఎందుకంటే గాల్లో పేరుకుపోయిన విషవాయువులు, ఆమ్లాలు ఈ నీటిలోనే ఎక్కువగా ఉంటాయి.

మనం చేసే 3 ప్రధాన తప్పులు:

నేరుగా నోటితో తాగడం: ఆకాశం వైపు చూస్తూ నేరుగా నోరు తెరిచి వర్షపు నీటిని తాగడం పెద్ద తప్పు. గాల్లో ఉండే పొగ, రసాయనాలు నేరుగా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఆల్కలైన్ నీటి అపోహ: వర్షపు నీరు ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటుందని, ఇది రక్తం pH స్థాయిని మెరుగుపరుస్తుందని ఇంటర్నెట్‌లో కొందరు ప్రచారం చేస్తుంటారు. కానీ సైన్స్ ప్రకారం, వర్షపు నీరు ఆల్కలైన్ కాదు, ఇది కొద్దిగా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది.

మరిగించకుండా నిల్వ చేయడం: వర్షపు నీటిని బకెట్లలో పట్టి నేరుగా తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి.

నేరుగా తాగితే వచ్చే ఆరోగ్య సమస్యలు:

కలుషితమైన వర్షపు నీటిని నేరుగా తాగడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన విరేచనాలు, వాంతులు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా, టైఫాయిడ్, కాలరా, హెపటైటిస్ ఎ వంటి ప్రమాదకరమైన నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

వర్షపు నీటిని ఎలా ఉపయోగించాలి?:

ఒకవేళ మీరు వర్షపు నీటిని తాగడానికి ఉపయోగించాలనుకుంటే, ముందుగా ఆ నీటిని బాగా మరిగించాలి. నీటిని మరిగించడం వల్ల అందులోని బ్యాక్టీరియా, వైరస్‌లు నశిస్తాయి. అలాగే, భారీ లోహాలు, రసాయనాలను తొలగించడానికి మంచి వాటర్ ఫిల్టర్ సిస్టమ్‌ను ఉపయోగించాలి. ఒకవేళ సరిగ్గా శుద్ధి చేయడం సాధ్యం కాకపోతే, ఆ నీటిని తాగడానికి కాకుండా మొక్కలకు పోయడానికి, బట్టలు ఉతకడానికి లేదా స్నానానికి ఉపయోగించడం ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రాఖీ స్పెషల్.. స్వీట్ షాప్ స్టైల్‌లో హల్వా ఇంట్లో ఎలా చేయాలంటే?
రాఖీ స్పెషల్.. స్వీట్ షాప్ స్టైల్‌లో హల్వా ఇంట్లో ఎలా చేయాలంటే?
29 ఏళ్ల వయసు చిన్నదైన భార్య.. ఈ తోపు విలన్ ప్రేమ కథ తెలిస్తే..
29 ఏళ్ల వయసు చిన్నదైన భార్య.. ఈ తోపు విలన్ ప్రేమ కథ తెలిస్తే..
తోబుట్టువులకు ఈ గిఫ్ట్స్ ఇస్తే సర్‌ప్రైజ్ ఖాయం.. బడ్జెట్‌లోనే..
తోబుట్టువులకు ఈ గిఫ్ట్స్ ఇస్తే సర్‌ప్రైజ్ ఖాయం.. బడ్జెట్‌లోనే..
ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. రూ.1.50లక్షల వరకు సబ్సిడీ
ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. రూ.1.50లక్షల వరకు సబ్సిడీ
సౌభాగ్య యోగం.. ఈ రాశుల వారికి పట్టింది బంగారమే!
సౌభాగ్య యోగం.. ఈ రాశుల వారికి పట్టింది బంగారమే!
గర్భిణీలను చూస్తే పాములకు కళ్లు కనిపించవా?అసలు కథ ఇదే
గర్భిణీలను చూస్తే పాములకు కళ్లు కనిపించవా?అసలు కథ ఇదే
భారత్‌పై వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన శ్రీలంక యువ బ్యాటర్
భారత్‌పై వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన శ్రీలంక యువ బ్యాటర్
GATE 2027 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు ఇవే
GATE 2027 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు ఇవే
అప్పట్లో రూ.36 లక్షలు పెట్టి కొన్న ల్యాండ్.. తర్వాత ఏమైందంటే
అప్పట్లో రూ.36 లక్షలు పెట్టి కొన్న ల్యాండ్.. తర్వాత ఏమైందంటే
రేపే చంద్రగ్రహణం..గ్రహణం పూర్తైన తర్వాత తప్పక చేయాల్సిన 4 పనులివే
రేపే చంద్రగ్రహణం..గ్రహణం పూర్తైన తర్వాత తప్పక చేయాల్సిన 4 పనులివే