AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాము కరిచిన చోట నోటితో విషం పీలుస్తున్నారా? ప్రాణాలు తీసే పెద్ద తప్పు ఇదే! వైద్యుల హెచ్చరిక

పాము కాటుకు గురైనప్పుడు చాలా మంది సినిమాల్లో చూపించినట్లు నోటితో విషాన్ని పీల్చి బయటకు ఉమ్మివేయడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, ఇది అత్యంత ప్రమాదకరమని, దీనివల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాము కాటుకు గురైన భర్తను రక్షించే క్రమంలో, అతని భార్య నోటితో విషాన్ని పీల్చడం వల్ల ఆమె నోటిలోని చిన్న గాయాల ద్వారా విషం ఆమె శరీరంలోకి కూడా ప్రవేశించి, ఆమె కూడా విషపూరితమైన ఒక నిజ జీవిత ఘటనలో చివరకు ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

పాము కరిచిన చోట నోటితో విషం పీలుస్తున్నారా? ప్రాణాలు తీసే పెద్ద తప్పు ఇదే! వైద్యుల హెచ్చరిక
Snake Bite Treatment
Jyothi Gadda
|

Updated on: Jul 14, 2026 | 7:37 PM

Share

గ్రామీణ ప్రాంతాలలో లేదా పొలాల్లో పనిచేసేటప్పుడు పాము కాటు బారిన పడటం చూస్తుంటాం. అయితే, పాము కరిస్తే వెంటనే చాలా మంది సినిమాల్లో చూసి ప్రభావితమై.. బాధితుడిని రక్షించాలనే ఆరాటంతో పాము కాటు వేసిన చోట నోటితో విషాన్ని గట్టిగా పీల్చి బయటకు ఉమ్మివేయడానికి ప్రయత్నిస్తారు. కానీ, ఈ పద్ధతి అత్యంత ప్రమాదకరమైనదని, దీనివల్ల రక్షించబోయిన వారి ప్రాణాలు కూడా పోతాయని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. తన భర్తను కాపాడబోయిన ఒక భార్య కూడా ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఒక నిజ జీవిత ఉదాహరణతో నోటితో విషం పీల్చడం ఎందుకు తప్పో ఇక్కడ తెలుసుకుందాం.

భర్తను కాపాడబోయి ప్రమాదంలో పడ్డ భార్య!

ఒక భయంకరమైన ఘటనలో, పాము కాటుకు గురైన భర్తను చూసి కంగారు పడింది అతని భార్య. వెంటనే అతని శరీరంలో నుండి విషాన్ని తీసేయడానికి నోటితో ఆ గాయాన్ని పీల్చింది. అయితే దురదృష్టవశాత్తూ, ఆమె నోటిలో ఉన్న చిన్నపాటి అల్సర్లు లేదా కంటికి కనపడని గాయాల ద్వారా ఆ పాము విషం ఆమె రక్తంలోకి కూడా వేగంగా ప్రవేశించింది. దీనివల్ల భర్తతో పాటు భార్య కూడా తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.

నోటితో విషాన్ని ఎందుకు పీల్చకూడదు?

మన నోటి లోపల చిన్న చిన్న చీలికలు లేదా చిగుళ్ల సమస్యలు సాధారణంగా ఉంటాయి. విషాన్ని పీల్చినప్పుడు అది నేరుగా ఆ గాయాల ద్వారా రక్తప్రవాహంలో కలిసిపోతుంది. నోటి ద్వారా ప్రవేశించే విషం, శరీరంలోని ఇతర భాగాల కంటే చాలా వేగంగా మెదడు, గుండెకు చేరుకుంటుంది. దీనివల్ల విషాన్ని పీల్చిన వ్యక్తి క్షణాల్లో స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

పాము కాటుకు ఏకైక ప్రాణరక్షక నివారణ ఆసుపత్రిలో ఇచ్చే యాంటీ స్నేక్ వెనమ్ ఇంజక్షన్ మాత్రమే. కాబట్టి, ప్రథమ చికిత్స పేరిట అశాస్త్రీయమైన పద్ధతులు పాటించి ఒకేసారి ఇద్దరి ప్రాణాలను ప్రమాదంలో పడేయకండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..