AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: టీ జల్లెడ నల్లగా మారిందా? ఈ సింపుల్ ట్రిక్‌తో నిమిషాల్లో క్లిన్ చేయండి!

భారతీయుల ఇళ్లలో ఉదయం, సాయంత్రం టీ కాచడం అత్యంత సాధారణమైన విషయం. అయితే, ప్రతిరోజూ టీ వడకట్టడం వల్ల ఆ గరిటెలకు టీ పొడి రంగు, పాలు, జిడ్డు పేరుకుపోయి అవి నల్లగా మారిపోతుంటాయి. క్రమంగా ఈ మురికి పేరుకుపోయి వడకట్టే చిన్న చిన్న రంధ్రాలన్నీ మూసుకుపోతాయి. సాధారణ డిష్ వాష్ సోప్‌తో తోమినా ఇవి అంత సులభంగా వదలవు. ఇంట్లో దొరికే కొన్ని సాధారణ వస్తువులతో ఈ నల్లటి మరకలను వదిలించి, మూసుకుపోయిన రంధ్రాలను క్లియర్ చేయడానికి కొన్ని అద్భుతమైన హోమ్ రెమెడీస్ ఇక్కడ చూద్దాం.

Kitchen Hacks: టీ జల్లెడ నల్లగా మారిందా? ఈ సింపుల్ ట్రిక్‌తో నిమిషాల్లో క్లిన్ చేయండి!
Tea Strainer Cleaning
Jyothi Gadda
|

Updated on: Jul 14, 2026 | 7:09 PM

Share

భారతీయుల ఇళ్లలో ఉదయం, సాయంత్రం టీ కాచడం అత్యంత సాధారణమైన విషయం. అయితే, ప్రతిరోజూ టీ వడకట్టడం వల్ల ఆ గరిటెలకు టీ పొడి రంగు, పాలు, జిడ్డు పేరుకుపోయి అవి నల్లగా మారిపోతుంటాయి. క్రమంగా ఈ మురికి పేరుకుపోయి వడకట్టే చిన్న చిన్న రంధ్రాలన్నీ మూసుకుపోతాయి. సాధారణ డిష్ వాష్ సోప్‌తో తోమినా ఇవి అంత సులభంగా వదలవు. ఇంట్లో దొరికే కొన్ని సాధారణ వస్తువులతో ఈ నల్లటి మరకలను వదిలించి, మూసుకుపోయిన రంధ్రాలను క్లియర్ చేయడానికి కొన్ని అద్భుతమైన హోమ్ రెమెడీస్ ఇక్కడ చూద్దాం.

బేకింగ్ సోడా, వెనిగర్ మ్యాజిక్:

ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకుని, అందులో ఒక చెంచా బేకింగ్ సోడా, రెండు చెంచాల వైట్ వెనిగర్ కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో టీ వడకట్టే గరిటెను ముంచి 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. వెనిగర్, బేకింగ్ సోడా చర్య వల్ల రంధ్రాలలో పేరుకుపోయిన మురికి మెత్తబడుతుంది. ఆ తర్వాత పాత టూత్ బ్రష్‌తో కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ వేసి రుద్దితే నల్లటి మరకలన్నీ వదిలిపోయి గరిటె కొత్తదానిలా మెరుస్తుంది.

స్టీల్ జల్లెడను క్లీన్ చేసే ఫైర్ ట్రిక్:

మీ ఇంట్లో ఉండేది స్టీల్ వడకట్టే గరిటె అయితే, దాన్ని శుభ్రం చేయడానికి ఒక సులువైన మార్గం ఉంది. స్టవ్ ఆన్ చేసి మంటను సిమ్‌లో పెట్టాలి. వడకట్టే స్టీల్‌ జల్లెడను నేరుగా మంటపై కొద్ది సెకన్ల పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల రంధ్రాలలో గట్టిగా పేరుకుపోయిన టీ పొడి జిడ్డు మాడిపోతుంది. ఈ పద్ధతిని ప్లాస్టిక్ వాటికి అస్సలు ఉపయోగించకూడదు. అలాగే స్టీల్ దానికి ప్లాస్టిక్ హ్యాండిల్ ఉంటే అది కాలిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. వేడి చేసిన తర్వాత గరిటెను కిందకు దించి, ఒక పాత బ్రష్‌తో మెల్లగా రుద్దితే మాడిన మురికి పొడిలా రాలిపోతుంది. ఆపై సోప్ నీటితో కడిగితే సరిపోతుంది.

ఇవి కూడా చదవండి

ప్రతిసారి టీ వడకట్టిన వెంటనే ఆ గరిటెను అలాగే వదిలేయకుండా, కనీసం నల్లా కింద పెట్టి ఒకసారి కడిగేస్తే రంధ్రాలలో మురికి పేరుకుపోకుండా ఉంటుంది. ఈ చిన్న చిట్కాలను పాటిస్తే మీ వంటింట్లోని టీ వడకట్టె జల్లెడ ఎల్లప్పుడూ శుభ్రంగా, సురక్షితంగా, సరికొత్తగా మెరుస్తూ ఉంటాయి!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం