Entertainment Breaking : వెబ్​సిరీస్​గా మధుబాబు ‘షాడో’ నవలలు..

తెలుగు సాహిత్యాన్ని చ‌దివేవారికి ప్ర‌ముఖ ర‌చ‌యిత మ‌ధుబాబుని ప్ర‌త్యేకంగా ప‌రిచయం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న రాసిన 'షాడో' న‌వ‌లలు ఎంతో ప్ర‌ముఖ్యత‌ను సంపాదించాయి.

Entertainment Breaking : వెబ్​సిరీస్​గా మధుబాబు 'షాడో' నవలలు..
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 26, 2020 | 6:21 PM

తెలుగు సాహిత్యాన్ని చ‌దివేవారికి ప్ర‌ముఖ ర‌చ‌యిత మ‌ధుబాబుని ప్ర‌త్యేకంగా ప‌రిచయం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న రాసిన ‘షాడో’ న‌వ‌లలు ఎంతో ప్రాముఖ్యత‌ను సంపాదించాయి. ఈ న‌వ‌ల్స్ ను విప‌రీతీంగా అభిమానిస్తారు సాహితీ జనాలు. అవి ఇప్పుడు దృశ్య‌రూపంలోకి మార‌బోతున్నాయి.  ఏకే ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ నిర్మాత అనిల్ సుంక‌ర వీటిని వెబ్ సిరీస్​గా తెరకెక్కించేందుకు సిద్ధమ‌య్యారు. ‘మధుబాబు షాడో’ పేరుతో వీటిని తెర‌కెక్కించ‌నున్నారు. తాజాగా నిర్మాత అనిల్ సుంకర దీనికి సంబంధించిన అఫిషియ‌ల్ అనౌన్సిమెంట్ చేశారు.

ఈ సిరీస్​లో ఓ ప్రముఖ హీరో నటిస్తారని స‌మాచారం. ఇప్ప‌టికే ఓ ఓటీటీ సంస్థ‌తో ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే న‌టీన‌టుల్ని అనౌన్స్ చేసి, ఈ ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకెళ్ల‌బోతున్నార‌ని ఇండ‌స్ట్రీలో టాక్ న‌డుస్తోంది.