గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన హీరో అడవి శేషు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాడు హీరో అడవి శేషు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా యాంకర్ అనసూయ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్‌లో...

  • Tv9 Telugu
  • Publish Date - 6:52 pm, Fri, 26 June 20
గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన హీరో అడవి శేషు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాడు హీరో అడవి శేషు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా యాంకర్ అనసూయ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటాడు హీరో అడవి శేషు. ఈ సందర్భంగా అడవి శేషు మాట్లాడుతూ.. పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మనందరం కూడా మొక్కలు నాటాలని అన్నారు. వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మరో ఇద్దరికి అడవి శేషు ఛాలెంజ్ విసిరాడు. హీరోయిన్ శోభిత, డైరెక్టర్ శశికిరణ్‌లకు ఛాలెంజ్ విసిరాడు అడవి శేషు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ ఇందులో పాల్గొన్నారు.

Read More: 

నాసా బంపర్ ఆఫర్.. మూన్‌పై టాయిలెట్‌ కట్టేందుకు బెస్ట్ ఐడియా ఇస్తే..

‘గూగుల్ పే’లో కొత్త ఫీచర్.. అప్పులు ఇచ్చేందుకు సిద్ధం..

వీడియో వైరల్: బుల్లెట్ నడుపుతూ బోర్లాపడ్డ జెర్సీ హీరోయిన్..

బ్రేకింగ్: మరో సీరియల్ నటుడికి కరోనా.. షూటింగ్ రద్దు