మహేష్-శర్వా కాంబోలో సినిమా..!
మహేష్ బాబు- శర్వానంద్ కాంబినేషన్‌లో సినిమా. ఇప్పుడు ఈ టాక్ ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే హీరోలుగా ఈ ఇద్దరు ఒకే సినిమాలో నటించడం కాదు.

మహేష్ బాబు- శర్వానంద్ కాంబినేషన్‌లో సినిమా. ఇప్పుడు ఈ టాక్ ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే హీరోలుగా ఈ ఇద్దరు ఒకే సినిమాలో నటించడం కాదు. మహేష్ బాబు నిర్మించే ఓ సినిమాలో శర్వా నటించబోతున్నట్లు తెలుస్తోంది. తన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో తాను నటించడంతో పాటు పలువురితో సినిమాలు తీయాలన్న ఆలోచనలో మహేష్ ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల మహేష్ బాబు ఓ కథను వినగా.. దానికి శర్వా బాగా సెట్ అవుతాడని భావించారట. ఈ నేపథ్యంలో శర్వాతో సంప్రదింపులు జరపడం, అందుకు ఆ యంగ్ హీరో ఓకే చెప్పాడని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
కాగా జీఎంబీ ఎంట్‌టైన్‌మెంట్‌లో ఇప్పటికే మహేష్ అడివి శేషు హీరోగా మేజర్ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరుతో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్న మహేష్.. త్వరలో పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాటలో నటించబోతున్నారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో మహేష్‌తో కీర్తి రొమాన్స్ చేయనుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.



