Andhra: అర్ధనారీశ్వడని కామసూత్ర ఫోటో ఎందుకు పెట్టినవ్ కాక.. నెట్టింట ఇప్పుడిదే హాట్ టాపిక్
ఒక్కోసారి కొన్ని చిన్న విషయాలు అనుకోకుండా తెగ వైరల్ అవుతాయి. ఆ నోటా ఈ నోటా చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. వివాదాలకు దారి తీస్తాయి. అలాంటి ఘటనే శ్రీకాకుళంలోనూ చోటు చేసుకుంది. ఒక సాంస్కృతిక కార్యక్రమ ప్రదర్శనకు సంబంధించి నిర్వాహకులు ముద్రించిన ఆహ్వాన పత్రిక, ఫ్లెక్సీలు ఇప్పుడు అక్కడ చర్చనీయాoశం అవుతోంది.

శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలంలోని కల్లేపల్లిలో సుమారు 16 ఎకరాల విస్తీర్ణంలో ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ స్వాతి సోమనాథ్ కూచిపూడి నృత్యకళను విస్తరించాలని ఉద్దేశంతో సాంప్రదాయం కూచిపూడి గురుకులం అనే సంస్థను ఏర్పాటు చేశారు. దీనికి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సంస్థ శనివారం సాయంత్రం గురుకులంలోని ఆడిటోరియంలో అర్ధనారీశ్వరం పేరుతో కూచిపూడి డాన్స్ డ్రామ ప్రదర్శనను నిర్వహించారు నిర్వాహకులు. అయితే దీనికి సంబంధించి ముద్రించిన ఇన్విటేషన్, ఫ్లెక్సీలు జిల్లాలో ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
ఇది చదవండి: ఒళ్లు గగుర్పొడుస్తున్న బాబా వంగా జోస్యం.. వామ్మో.! 2026 అత్యంత భయంకరంగా ఉంటుందా.?
ఆహ్వాన పత్రిక, ఫ్లెక్సీలపై ముద్రించిన కామసూత్రలోని ఓ భంగిమ ఫోటో వివాదాస్పదంగా మారింది. దీనికి తోడు ప్రదర్శనకు అర్ధనారీశ్వరం అని పేరు పెట్టడంతో పాటు దానికి శృంగారం నుంచి మోక్షం అంటూ ట్యాగ్ లైన్ పెట్టడంపై కూడా కొందరు మండిపడుతున్నారు. సమానత్వాన్ని ప్రతిబింబించే అర్ధనారీశ్వర తత్వాన్ని ఈ విధంగా వక్రీకరించడం ఆధ్యాత్మిక భావజాలానికి విరుద్ధమని పలువురు విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారం కేవలం ఒక ఆహ్వాన పత్రికకు సంబంధించినదే కాకుండా సంస్కృతి పరిరక్షణకు సంబంధించిన సున్నితమైన అంశం అని అభిప్రాయపడుతున్నారు.
అయితే ఫ్లెక్సీపైన ఇన్విటేషన్‌పైన ముద్రించిన ఫోటోను సమర్ధించుకుంటున్నారు సంస్థ నిర్వాహకురాలు స్వాతి సోమనాథ్. ఆ ఫోటో ఖజురహోలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల ఫోటో అని ఆమె అంటున్నారు. తమ సంస్థ ఇన్విటేషన్‌పై ఉన్న ఫోటోపై అభ్యంతరం చెబుతున్న వారు ఖజురహో, కోణార్క్ సూర్య దేవాలయంలపై ఉన్న బొమ్మలను తీయించి వేస్తారా అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. యద్భావం.. తద్భవతి…అంటూ చూసే వారి దృష్టిని బట్టి ఆ ఫోటో ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తూ ఉంటుందని ఆ ఫోటోలో ఎటువంటి తప్పిదం లేదని ఆమె కొట్టిపారేస్తున్నారు.
ఇది చదవండి: ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు ఊహకందదు..








