Telangana Lockdown: ఈ-పాస్ ఉంటేనే రవాణాకు అనుమతి.. ఎలా తీసుకోవాలో తెలుసా..? వివరాలు..

How to Apply E-Pass: తెలంగాణలో ఈ రోజు నుంచి పదిరోజుల పాటు కఠిన లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. వేరే రాష్ట్రాలకూ, ఇతర జిల్లాలకు

Telangana Lockdown: ఈ-పాస్ ఉంటేనే రవాణాకు అనుమతి.. ఎలా తీసుకోవాలో తెలుసా..? వివరాలు..
Lockdown In Telangana
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 12, 2021 | 9:57 AM

How to Apply E-Pass: తెలంగాణలో ఈ రోజు నుంచి పదిరోజుల పాటు కఠిన లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. వేరే రాష్ట్రాలకూ, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ-పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందచేయనున్నట్లు డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి మంగళవారం వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో అందచేసే ఈ- పాస్ లకు గాను https://policeportal.tspolice.gov.in/ అనే వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితులకు గాను లాక్ డౌన్ సడలించిన సమయంలో కాకుండా ఇతర సమయాల్లో ప్రయాణించేవారికి మాత్రమే పాసులను జారీ చేస్తామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రలకూ, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లే వారికి సంబంధిత పోలీస్ కమీషనర్లు, ఎస్పీలు మాత్రమే పాస్‌లను జారీ చేస్తారని తెలిపారు. అయితే, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వారికి మాత్రం సంబంధిత రాష్ట్రాల నుంచే పాస్‌లు జారీ చేస్తారన్నారు. హైదరాబాద్ లో ఒక కమిషనరేట్ నుంచి మరో కమిషనరేట్ పరిధికి ప్రయాణించే వారికి ప్రయాణం ప్రారంభమయ్యే పరిధిలోని కమిషనరేట్ నుంచే పాసులు జారీ చేస్తారని వివరించారు. లాక్ డౌన్ సడలింపు సమయమైన ఉదయం ఆరు గంటలనుండి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఏవిధమైన పాసులు అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే దరఖాస్తు చేసుకునే వారు వెబ్‌సైట్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ విధంగా దరఖాస్తు చేసుకోండి..

➼ ముందుగా తెలంగాణ పోలీస్ అధికారిక వెబ్‌సైట్ https://policeportal.tspolice.gov.in/ లో లాగిన్ కావాలి ➼ అనంతరం ఈ పాస్ e-Pass పై క్లిక్ చేయాలి ➼ మీరు నివసిస్తున్న జిల్లా/కమిషనరేట్‌ను ఎంపిక చేసుకోవాలి ➼ ఆ తర్వాత మీరు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది ➼ పేరు, ఆధార్ నెంబర్, వాహనం, ఎంతమంది, పాస్ ఎందుకు, ఏ పర్పస్ కోసం, ఫోన్ నెంబర్లు, మీరు వెళ్లాల్సిన పోలీస్ స్టేషన్ పరిధి, డిస్టెన్స్, తదితర వివరాలతోపాటు.. ఫొటో, పర్పస్ డాక్యుమెంట్, కేవైసీ ఫాంలను అప్‌లోడ్ చేయాలి. ➼ ఆతర్వాత కర్ఫర్మేషన్ వస్తుంది. ➼ ఆయా పరిధుల్లోని కమిషనరేట్, ఎస్పీల నుంచి ఈ పాస్ మంజూరు అవుతుంది. ➼ దానిని చూపించి రాష్ట్రం పరిధిలోని జిల్లాలకు ఆంక్షల సమయంలో ప్రయాణం చేయవచ్చు.

Also Read:

Chundur SI: కానిస్టేబుల్‌తో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన చుండూరు ఎస్ఐ శ్రావణి మృతి..

Lockdown effect: అటు రానివ్వరు.. ఇటు పోనివ్వరు.. ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఆంక్షలు.. భారీగా నిలిచిన వాహనాలు