Hyderabad: లాక్‌డౌన్‌ అమలుపై తెలంగాణ పోలీస్ స్పెషల్ ఫోకస్.. ఈ-పాస్ పొందాలంటే..(Video)

Hyderabad Police Tweet: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పకడ్బంధీగా అమలు చేసేందుకు తెలంగాణ పోలీసు శాఖ దృష్టి సారించింది. ప్రభుత్వ ఆదేశాలతో..

Hyderabad: లాక్‌డౌన్‌ అమలుపై తెలంగాణ పోలీస్ స్పెషల్ ఫోకస్.. ఈ-పాస్ పొందాలంటే..(Video)
Telangana-Police


Hyderabad Police Tweet: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పకడ్బంధీగా అమలు చేసేందుకు తెలంగాణ పోలీసు శాఖ దృష్టి సారించింది. ప్రభుత్వ ఆదేశాలతో లాక్‌డౌన్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన పోలీస్‌ శాఖ ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. ఇదిలా ఉంటే లాక్ డౌన్ సమయంలో వేరే రాష్ట్రాలకూ, ఇతర జిల్లాలకు వెళ్లే వారి వద్ద ఈ-పాస్‌లు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది.

ప్రత్యేక పాసుల కోసం https://policeportal.tspolice.gov.in/ అనే వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. అందుకు సంబంధించిన ఓ వీడియోను కమిషనర్ అంజనీ కుమార్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. కాగా, వివాహాలకు 40 మంది మాత్రమే హాజరయ్యే విధంగా చూడాలని.. అలాగే తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని చెప్పారు. అదేవిధంగా, అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరు కావాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా అత్యవసరమైతే తప్ప రోడ్ల మీదకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు.. ఏం చేయాలి.? ఏం చేయకూడదు.?

ఐపీఎల్ వాయిదా.. పలు ఫ్రాంచైజీలకు లాభం.. ఆ ఐదుగురు ప్లేయర్ల పునరాగమనం.!

Viral Video: ద్యావుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..!

భారీ నాగపామును పట్టి బరాబరా ఈడ్చుకెళ్లిన బామ్మ.. నెటిజన్లు ఫిదా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!