Chundur SI: కానిస్టేబుల్‌తో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన చుండూరు ఎస్ఐ శ్రావణి మృతి..

Chundur SI Sravani died: గుంటూరు జిల్లాలోని చుండూరు ఎస్ఐ పిల్లి శ్రావణి ( 35) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున

Chundur SI: కానిస్టేబుల్‌తో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన చుండూరు ఎస్ఐ శ్రావణి మృతి..
Chunduru SI Sravani died
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 12, 2021 | 9:21 AM

Chundur SI Sravani died: గుంటూరు జిల్లాలోని చుండూరు ఎస్ఐ పిల్లి శ్రావణి ( 35) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మరణించారు. గత శనివారం కానిస్టేబుల్ రవీంద్రతో కలసి శ్రావణి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన పిల్లి శ్రావణి 2018 బ్యాచ్ ఎస్ఐ. నరసరావుపేటలో దిశ పోలీసు స్టేషన్‌లో ఆమెకు తొలి పోస్టింగ్ వచ్చింది. చుండూరు పోలీసు స్టేషన్లో ఎస్ఐ శ్రావణి ఏడు నెలల నుంచి (గతేడాది అక్టోబరు) విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రవీంద్రతో ఆమె సన్నిహితంగా మెలిగేవారు.

అయితే.. గత శనివారం ఇద్దరూ కలసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అనంతరం వారిద్దరూ కారులో వెళ్లి తెనాలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం వారిని గుంటూరులోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. ఈ క్రమంలో శ్రావణి పరిస్థితి విషమించడంతో ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. కాగా ఎస్ఐతో కలిసి బలవన్మరణానికి యత్నించిన కానిస్టేబుల్ రవీంద్ర ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Also Read:

Lockdown effect: అటు రానివ్వరు.. ఇటు పోనివ్వరు.. ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఆంక్షలు.. భారీగా నిలిచిన వాహనాలు

Arabian Sea Cyclone: వాతావరణ హెచ్చరిక.. ముంచుకొస్తున్న తుఫాన్.. పొంచి ఉన్న మరో ముప్పు..!