Arabian Sea Cyclone: వాతావరణ హెచ్చరిక.. ముంచుకొస్తున్న తుఫాన్.. పొంచి ఉన్న మరో ముప్పు..!
Arabian Sea Cyclone: ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న భారత్‌కు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. తుఫాను రూపంలో ప్రకృతి దాడి చేసే..
Arabian Sea Cyclone: ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న భారత్‌కు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. తుఫాను రూపంలో ప్రకృతి దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో తుఫాన్ వచ్చే సంకేతాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. మే 14 నాటికి అరేబియా సముద్రంలో అల్ప పీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది క్రమంగా ఈ నెల 16 నాటికి బలపడి వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. బలపడిన అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు హెచ్చరించింది.
ఈ తుఫాన్‌కు తౌక్టే అని పేరు పెట్టారు. ఒకవేళ ఇది భారత తీరాన్ని తాకితే ఈ ఏడాది దేశంలో ఇదే మొదటి తుఫాన్ అవుతుందన్నారు. దీని ప్రభావంతో కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాబట్టి ఈ రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో మత్స్యకారులు ఈ నెల 14 నుంచి సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
తుఫాన్ ప్రభావంతో మాల్దీవులు, లక్షద్వీప్‌లలో గంటకు 60కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే సూచనలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే వారాంతంలో ఇక్కడి సముద్రంలో ఒక మీటరు ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. తుఫాన్ ఏ దిశను తీసుకుంటుందన్నది ఇప్పుడే చెప్పడలేమని, అల్పపీడన తీవ్రతను వాతావరణ శాఖ నిశితంగా గమనిస్తోందని..దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు తగిన సూచనలు జారీ చేస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Also Read:
హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు.. ఏం చేయాలి.? ఏం చేయకూడదు.?
ఐపీఎల్ వాయిదా.. పలు ఫ్రాంచైజీలకు లాభం.. ఆ ఐదుగురు ప్లేయర్ల పునరాగమనం.!
Viral Video: ద్యావుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..!
భారీ నాగపామును పట్టి బరాబరా ఈడ్చుకెళ్లిన బామ్మ.. నెటిజన్లు ఫిదా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!