బాబ్రీ కేసులో తీర్పును మ‌నస్ఫూర్తిగా స్వాగ‌తిస్తున్నాః అద్వానీ

బాబ్రీ మ‌సీదు కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పుపై బీజీపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ స్పందించారు.

  • Balaraju Goud
  • Publish Date - 2:09 pm, Wed, 30 September 20
బాబ్రీ కేసులో తీర్పును మ‌నస్ఫూర్తిగా స్వాగ‌తిస్తున్నాః అద్వానీ

బాబ్రీ మ‌సీదు కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పుపై బీజీపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ స్పందించారు. సీబీఐ ప్ర‌త్యేక కోర్టు ఇచ్చిన తీర్పును మ‌న‌స్ఫూర్తిగా స్వాగ‌తిస్తున్నాన‌ని తెలిపారు. బాబ్రీ మ‌సీదు కేసులో నిందితుల‌పై మోపిన‌ అభియోగాల‌ను ల‌క్నోలోని సీబీఐ ప్ర‌త్యేక కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఎల్‌కే అద్వానీ స‌హా 32 మందిని కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈ క్ర‌మంలో ఎల్‌కే అద్వానీ స్పందిస్తూ.. ఈ తీర్పు రామ‌జ‌న్మభూమి ఉద్య‌మం ప‌ట్ల త‌న నిబ‌ద్ద‌త‌తో పాటు బీజేపీ చిత్త‌శుద్ధిని తెలియ‌జేస్తుంద‌ని అద్వానీ పేర్కొన్నారు. ఈ కేసులో అద్వానీ నిర్దోషిగా ప్ర‌క‌టించ‌బ‌డ‌టంతో ఆయ‌న నివాసానికి ప‌లువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నాయ‌కులు వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు.