ఉత్తమ ముఖ్యమంత్రి జగనన్న.. ఏ ప్లేస్‌లో నిలిచారంటే.?
దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన ముఖ్యమంత్రుల జాబితాను ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే తాజాగా విడుదల చేసింది. ఇక ఇందులో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. అమ్మ ఒడి, నాడు-నేడు, వైఎస్సాఆర్ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్య శ్రీ వంటి పలు ప్రజా సంక్షేమ పథకాలను సీఎం జగన్ అతి తక్కువ కాలంలోనే అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ […]

దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన ముఖ్యమంత్రుల జాబితాను ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే తాజాగా విడుదల చేసింది. ఇక ఇందులో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. అమ్మ ఒడి, నాడు-నేడు, వైఎస్సాఆర్ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్య శ్రీ వంటి పలు ప్రజా సంక్షేమ పథకాలను సీఎం జగన్ అతి తక్కువ కాలంలోనే అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ లిస్టులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్(బీజేపీ) అగ్రస్థానంలో నిలవగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(ఆప్), వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(తృణమూల్ కాంగ్రెస్)లు రెండో స్థానాన్ని పంచుకున్నారు. ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మూడో ప్లేస్‌లో నిలిచారు.
అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత జాబితాలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌లు ఐదవ స్థానంలో.. గుజరాత్ సీఎం విజయ్‌రూపాని, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్, హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌లు ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. కాగా, ఈ బెస్ట్ పెర్ఫార్మింగ్ సీఎంల జాబితాలో 2016వ సంవత్సరం ట్రెండ్స్‌ను కూడా పొందుపరిచారు.