శ్రీశైల మల్లన్న ప్రసాదం మరింత ప్రియం..మళ్లీ పెరిగిన లడ్డూ ధర
కార్తీక మాసం వచ్చిందంటే.. శ్రీశైలంలో భక్తకోటి సందడి చేస్తుంది. శివనామ స్మరణతో శ్రీశైల మల్లన్న ఆలయం ప్రతిధ్వనిస్తుంది.

కార్తీక మాసం వచ్చిందంటే.. శ్రీశైలంలో భక్తకోటి సందడి చేస్తుంది. శివనామ స్మరణతో శ్రీశైల మల్లన్న ఆలయం ప్రతిధ్వనిస్తుంది. దాదాపు నాలుగు రాష్ట్రాల భక్తుల కార్తీక మాసంతో లక్షలాదిగా తరలివచ్చి దర్శించుకుంటారు. దక్షిణ భారతంలో ప్రముఖ శైవక్షేత్రం కావడంతో.. తాకిడిని తట్టుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో మల్లన్న లడ్డూ ప్రసాదం ధరను అమాంతం పెంచేశారు ఆలయ అధికారులు. దీంతో సామాన్య భక్తులపై ఈ ప్రభావం పడనుంది. గతంలో 80 గ్రాముల లడ్డు 10 రూపాయలు ఉంంది. భరత్ గుప్తా ఈఓ గా ఉన్న సమయంలో 100 గ్రాములు లడ్డు ధర 15 రూపాయలు చేశారు. ఇప్పుడు 100 గ్రాముల లడ్డూ ధర 20 రూపాయలకు పెంచారు. దీంతో ఏడాది కాలంలో లడ్డూ ధర రెండింతలైంది.
కోవిడ్ వల్ల నెలల పాటు శ్రీశైల క్షేత్రాన్ని మూసేసారు అధికారులు. ఆలయంలో కైంకర్యాలను ఆపకపోయినా.. భక్తులను అనుమతించలేదు. తర్వాత తెరుచుకున్నా.. మళ్లీ మళ్లీ మూసేశారు. దీంతో ఆలయ ఆదాయానికి గండి పడింది. ఇప్పుడు కార్తీక మాసం కావడంతో.. భక్తులు పోటెత్తారు. పనిలోపనిగా లడ్డూ ధర కూడా పెంచడంతో.. అటు హుండీ ఆదాయంతోపాటు.. ఇటు లడ్డూలపైనా ఆదాయం పెరగనుంది.
కోవిడ్ సమయంలో రాష్ట్రంలోని అనేక ఆలయాల్లో లడ్డూ ధరలు తగ్గించారు. టీటీడీ బల్క్‌గా అనేక పట్టణాలు, నగరాల్లో లడ్డూ అమ్మకాలు జరిపింది. శ్రీశైల మల్లన్న లడ్డూని కూడా కార్తీక మాసంలో అలానే అమ్మాలని డిమాండ్లు వస్తున్నాయి. దీంతో శ్రీశైలం బయట అమ్మే లడ్డూల ధరలు ఇంకా పెరిగే అవకాశాలున్నాయి.
Also Read :
రైట్, రైట్.. డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి ఆర్టీసీ అద్దె బస్సులు
పచ్చిచేపను కసకస కొరికి తినేసిన శ్రీలంక మాజీ మంత్రి..ఎందుకంటే ?