Konda Vishweshwar Reddy: ఎట్టకేలకు సై అన్న కొండా… కమల దళంలో చేరేందుకు మూహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేసిన తర్వాత తటస్థంగా ఉన్న కొండా... ఎటు వెళ్లాలో తేల్చుకోలేక తర్జనభర్జనలు పడ్డారు. తాజాగా బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్‌చుగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. మరికొంత మంది నేతలపై బీజేపీ జాతీయ నేతలు..
బీజేపీ జాతీయ కార్యవర్గాల సమావేశాల సందర్భంగా ఆ పార్టీ చేరికలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కమలదళంలో కలుపుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఎట్టకేలకు కాషాయ కండువా కప్పుకోవడానికి చేవెళ్లమాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అంగీకరించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేసిన తర్వాత తటస్థంగా ఉన్న కొండా… ఎటు వెళ్లాలో తేల్చుకోలేక తర్జనభర్జనలు పడ్డారు. తాజాగా బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్‌చుగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. మరికొంత మంది నేతలపై బీజేపీ జాతీయ నేతలు పార్టీలో చేరికలపై ఒత్తిళ్లు చేస్తున్నట్టు సమాచారం.
చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీ గూటిలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన తర్వాత.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత ఏ పార్టీలో చేరేది లేదని.. కొన్నాళ్లు తటస్థంగా ఉంటానని కొండా అప్పట్లో ప్రకటించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతు ఇస్తూ ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోకి తిరిగి వెళ్తారనే ప్రచారం విస్తృతంగా సాగింది. ఎటు తేల్చుకోలేక చాలా సతమతమైన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చివరకు కాషాయ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు.
కొండా ఇంటికి వెళ్లిన బీజేపీ నేతలు తరుణ్‌చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముందు పలు అనుమానాలను లేవనెత్తారు. ఆ అనుమానాలపై స్వయంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో ఫోన్‌లో మాట్లాడించి క్లియర్ చేసేశారు. దీంతో బీజేపీలో చేరడానికి ఆయన అంగీకరించినట్లు పార్టీ నేతలు చెప్పారు. ఇప్పటికే చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని మహేశ్వరం, తాండూరు అసెంబ్లీ స్థానాల్లో కొండా సొంతంగా సర్వే చేయించుకున్నారు. బీజేపీ నుంచి తాండూరు లేదా మహేశ్వరం అసెంబ్లీ బరిలో దిగాలని కొండా భావిస్తున్నారు.
రిపోర్టర్ : అగస్త్య
మరిన్ని పొలిటికల్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి