Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓలమ్మో.. బుడ్డొడి మీద కుక్క పిల్లకు ఎంత ప్రేమో.. ఈ వీడియో చూస్తే మీ మనసు నిండిపోతుంది..

ఎంతో ప్రేమగా పెంచుకునే కుక్కలను ఇంట్లోని చిన్నపిల్లలతో సమానంగా చూస్తుంటారు. అవి కూడా యజమాని పిల్లల పట్ల అంతే ప్రేమ, అప్యాయతను చూపిస్తుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్‌ అవుతోంది. వీడియోలో చిన్నపిల్లవాడిని..

Viral Video: ఓలమ్మో.. బుడ్డొడి మీద కుక్క పిల్లకు ఎంత ప్రేమో.. ఈ వీడియో చూస్తే మీ మనసు నిండిపోతుంది..
Husky Hugging
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 29, 2022 | 5:25 PM

సాధారణంగా ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల కనబరిచే విశ్వాసం దాని పట్ల ఏర్పర్చుకొనే ఆత్మీయత మనసుకు ఎంతో ఉల్లాసాన్నిస్తుంది. మనిషి జంతువుల మధ్య అలాంటి బంధం ఏర్పడితే అది కలకాలం కొనసాగుతుంది. అయితే వాటిని పెంచుకోవడం ఎంత అవసరమో అందురే తగ్గ జాగ్రత్తలు కూడా అంతే అవసరం..ఆప్యాయతలోనూ…అప్రమత్తతలోనూ పెంపుడు జంతువుల పెంపకంలో జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా పెంపుడు కుక్కలపై కొంతమంది విపరీతమైన ప్రేమను పెంచుకుంటున్నారు. వాటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తుంటారు. ఎంతో ప్రేమగా పెంచుకునే కుక్కలను ఇంట్లోని చిన్నపిల్లలతో సమానంగా చూస్తుంటారు. అవి కూడా యజమాని పిల్లల పట్ల అంతే ప్రేమ, అప్యాయతను చూపిస్తుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్‌ అవుతోంది. వీడియోలో చిన్నపిల్లవాడిని హత్తుకుని పడుకుని ఉన్న హస్కీ డాగ్ అతనిపట్ల చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. మరీ అంత ప్రేమ ప్రమాదం బాస్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే…

వైరల్‌ అవుతున్న వీడియోలో సుమారు మూడేళ్ల వయసుండే ఓ బాలుడు బెడ్‌పై హాయిగా నిద్రపోతున్నాడు. ఆ పక్కనే వారి పెంపుడు కుక్క హస్కీ డాగ్‌ కూడా పడుకుని ఉంది. ఆ కుక్క బాలుడిపై ఓ కాలువేసి పడుకుని ఉంది. అంతలోనే యజమాని ఆ బాలుడి వద్దకు వస్తాడు.. మెల్లిగా బాలుడిని తట్టి లేపుతున్నట్టుగా చేస్తాడు.. దాంతో హస్కీ నిద్రలేస్తుంది. వెంటనే యజమాని చేయిని డాగ్‌ తన కాలితో అడ్డుకుంటుంది. బాలుడిని నిద్రలేపొద్దు అన్నట్టుగా యజమాని ముఖం చూస్తుంది. మరోమారు అతడు బాలుడిని నిద్రలేపే ప్రయత్నం చేయగా, అది మళ్లీ అతన్ని అడ్డుకుంటుంది. దాంతో అతడు ప్రేమగా హస్కీని కూడా కాస్త నిమిరి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అంతలోనే ఆ చిన్నారి నిద్రలోంచి లేచాడు.. దాంతో వెంటనే ఆకుక్క అతడి ముఖం, మూతిని నాకుతుంది. అలా పదేపదే చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి హాయిగా నిద్రపోతారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. ఎంత పెంపుడు కుక్కలైనా, పసివాళ్లను మరీ అంతదగ్గరగా ఉంచితే ఎలా బాస్ అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. కుక్క బాలుడి పెదాలు, ముఖం అంతలా నాకేస్తుంటే.. ఏం చేస్తున్నారంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలుడు, పెంపుడు కుక్క మధ్య ఎంత ప్రేమ, స్నేహం ఉన్నాయి అంటూ ఇంకొందరు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట బాగా వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి