Floating House: వావ్‌ వండర్‌ హౌస్..! వరద ముంచేస్తే పైకి లేస్తుంది.. నీరు తగ్గితే మళ్లీ దిగొస్తుంది

సాధారణంగా ఇది నేలపైనే ఉంటుంది. కానీ, ఒక్కసారి వరద నీరు చుట్టూ చేరితే క్రమంగా ఆ ఇళ్లు పైకి తేలుతుంది. ఇచిజో కొముటెన్ అనే కంపెనీ ఈ ఇంటితో చేసిన కొత్త ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Floating House: వావ్‌ వండర్‌ హౌస్..!  వరద ముంచేస్తే పైకి లేస్తుంది.. నీరు తగ్గితే మళ్లీ దిగొస్తుంది
Floating House
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 29, 2022 | 4:57 PM

వరదల్లో మునిగిపోకుండా తేలియాడే ఇంటిని ఓ కంపెనీ కనిపెట్టింది. ఈ ప్రత్యేకమైన ఇంటిలో, మీరు ఇతర ఇళ్లలో సాధారణంగా లభించే అన్ని లగ్జరీ సౌకర్యాలను కూడా పొందుతారు. ఈ ఇంట్లో వరదలు,వేడిని నివారించే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జపనీస్ కంపెనీ ఆవిష్కరణ జపాన్‌కు చెందిన ఇచిజో కొముటెన్ అనే హౌసింగ్ డెవలప్‌మెంట్ కంపెనీ వరద పీడిత దేశాల్లోని సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నట్లు పేర్కొంది. ఈ కంపెనీ ఫ్లడ్ ఫ్లోటింగ్ హౌస్‌ను కనిపెట్టింది. ఇందులో వరద ముంపు ప్రాంతాల్లో కూడా ప్రజలు హాయిగా జీవించవచ్చు.

ఎంతటి భారీ వరదలు వచ్చినా ఈ ఇంటిలోని వారికి ఏమీ కాదు. ఎందుకంటే ఇది వరద నీటిపై తేలి ఉంటుంది. వరద బాధిత ప్రాంతాలకు ఈ ఇల్లు అనుకూలమని సదరు జపాన్‌ కంపెనీ ప్రకటించింది. ఈ ఇంటి నిర్మాణం వినూత్నంగా, వాటర్ ప్రూఫ్ తో ఉంటుంది. సాధారణంగా ఇది నేలపైనే ఉంటుంది. కానీ, ఒక్కసారి వరద నీరు చుట్టూ చేరితే క్రమంగా ఆ ఇళ్లు పైకి తేలుతుంది. ఇచిజో కొముటెన్ అనే కంపెనీ ఈ ఇంటితో చేసిన కొత్త ప్రయోగం యావత్‌ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇల్లు మామూలు ఇల్లులానే ఉంటుందని కంపెనీ తెలిపింది. కానీ దాని చుట్టూ నీరు నిండడం ప్రారంభించినప్పుడు, ఇల్లు నెమ్మదిగా భూమిని వదిలి పైకి లేస్తుంది. అంటే ఎంతటి వరదలు సంభవించినా ఇల్లు మునిగిపోయే ప్రమాదం లేదని స్పష్టం చేశారు.

వరదలో తేలి ఉండే ఈ ఇల్లు ఎలా పైకి తేలుతుందో సదరు కంపెనీ ప్రదర్శించి చూపించింది. ఆ వీడియో ఆధారంగా…ఇంటి చుట్టూ పైపుతో నీరు వదిలిపెట్టగా, క్రమంగా ఇల్లు పైకి తేలడం వీడియోలో కనిపిస్తోంది. ఐరన్ రాడ్స్ తో ఇంటిని నిర్మిస్తారు. వరదనీటిలో ఇల్లు కొట్టుకుపోకుండా ఉండేందుకు కేబుల్స్ సాయంతో కట్టిఉంచారు. తిరిగి వరద నీరు మొత్తం వెళ్లిపోగానే ఇల్లు దానంతట అదే కిందకు దిగిపోతుంది. సుమారు 5 మీటర్ల ఎత్తు వరకు నీటిపై ఇల్లు తేలుతుంది. ఇంటి పైనుంచే విద్యుత్ సదుపాయం ఉంటుంది కనుక ప్రమాద భయం లేదు. జపాన్ భూకంపాలు, వరదల విపత్తులను ఎదుర్కొంటుంటుంది.

ఇవి కూడా చదవండి

ప్రపంచంలో భారత్‌తో సహా అనేక దేశాల్లో వరదల్లో చిక్కుకున్న రాష్ట్రాలు చాలానే ఉన్నాయి. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇక్కడే తలదాచుకోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జపాన్ శాస్త్రవేత్తల ఈ టెక్నిక్ విజయవంతమైతే వరద ముంపు ప్రాంతాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనదేశంలో అసోం రాష్ట్రానికి ఈ ఇల్లు అనుకూలంగా ఉంటుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు