Disease X: డిసీజ్‌ ఎక్స్‌.. మాయదారి కొత్త రోగం.. సోకితే చావే..! ఇదో ఊహాజనితమైన అంటువ్యాధి

డాక్టర్లు, సైంటిస్టులు ఈ మహమ్మారి గురించి ముందస్తు హెచ్చరికలు జారీచేస్తున్నారు. డిసీజ్‌ ఎక్స్‌ గా పిలవబడుతున్న ఈ మహా రోగం సోకితే.. చావే అంటున్నారు. అసలేంటీ డిసీజ్‌ ఎక్స్‌?

Disease X: డిసీజ్‌ ఎక్స్‌.. మాయదారి కొత్త రోగం.. సోకితే చావే..! ఇదో ఊహాజనితమైన అంటువ్యాధి
Disease X
Ram Naramaneni

|

Jun 29, 2022 | 7:56 PM

Disease X Symptoms: సీజన్లు మారుతున్నాయ్‌.. సీజనల్‌ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. దీర్ఘకాలిక వ్యాధులకు ఇవి తోడైతే.. బతుకు బస్టాండే. కరోనా వేవ్‌లని చూస్తూనే ఉన్నాం. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపిన ఈ మహమ్మారిని మించిన వ్యాధి ముంచుకొస్తోంది. డాక్టర్లు, సైంటిస్టులు ఈ మహమ్మారి గురించి ముందస్తు హెచ్చరికలు జారీచేస్తున్నారు. డిసీజ్‌ ఎక్స్‌ గా పిలవబడుతున్న ఈ మహా రోగం సోకితే.. చావే అంటున్నారు. అసలేంటీ డిసీజ్‌ ఎక్స్‌? దాని లక్షణాలేంటి? నివారించే పద్దతులున్నాయా? టీవీ9 అందిస్తున్న ఎక్స్‌క్లూజివ్‌ వివరాలు…

మనుషుల్ని ఈ వైరస్‌లు బతకనిచ్చేలా లేవు. రోజుకో వైరస్‌.. పూటకో వ్యాధితో ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ఓవైపు సీజనల్‌ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులకు తోడు.. ఈ అంటు వ్యాధులు, వైరస్‌, మలేరియా, బ్యాక్టీరియాల వల్ల సొకే వ్యాధులు అబ్బో ఒకటేంటి మన జీవితాలను సర్వనాశనం చేసేవి ఎన్నొ ఉన్నాయి. ఇప్పుడు మరో వ్యాధి మెల్లిగా మొదలైంది. కరోనాకి కోటి రెట్లు డేంజరస్‌. దానిపేరే డిసీజ్‌ ఎక్స్‌. ఇది మరో మహమ్మారిగా మారే అవకాశాలు చాలా ఉన్నాయి. బ్రిటన్‌ నాలాల్లోని మురికినీటి నమూనాల్లో ఇటీవల పోలియో వైరస్‌ని గుర్తించారు. అయితే, పోలియోను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ విస్తృతంగా పంపిణీ చేస్తున్నామని.. దీంతో పోలియో వ్యాప్తించే ప్రమాదమేమీ లేదంటున్నారు బ్రిటన్‌ అధికారులు. అంతేకాదు.. అక్కడ చల్లని వాతావరణంతోపాటు.. ఎప్పుడూ వర్షాలు కురుస్తుండడంతో ఒక్కో వ్యాధి ప్రబలుతోంది. కరోనా వైరస్‌తో వణికిపోయిన బ్రిటన్‌లో ఇటీవల మంకీపాక్స్‌ వ్యాధి ఆందోళనకర స్థాయిలో వ్యాపిస్తోంది. ఇప్పటికే దాదాపు వెయ్యి కేసులు నిర్ధారణ అయ్యాయి. గుర్తించని కేసులు ఇంకా ఉండవచ్చంటున్నారు అధికారులు. ఈ వ్యాధికంటే ముందు క్రిమియన్‌-కాంగో జ్వరం కేసులు నమోదుకావడం బ్రిటన్‌ను టెన్షన్ పెట్టింది. ఇటీవలి కాలంలో లాస్సా ఫీవర్‌, బర్డ్‌ ఫ్లూ వంటి కేసులు కూడా బ్రిటన్‌లో వెలుగుచూశాయి. ఇలా వరుసగా అంటువ్యాధులు జనాలపై అటాక్ చేస్తోన్న వేళ రానున్న రోజుల్లో ఇవి మరింత ప్రబలే ప్రమాదముందని హెచ్చరించారు నిపుణులు. డిసీజ్‌ ఎక్స్‌ (Disease X)వంటి కొత్త వ్యాధికారకాలను ఎదుర్కొనేందుకు అలెర్ట్‌గా ఉండాలన్నారు.

ఇంతకీ ఏంటీ డిసీజ్‌ ఎక్స్‌?

‘డిసీజ్‌ ‘ఎక్స్‌’ అనేది ఊహించని, ప్రస్తుతానికి ఊహాజనితమైన, అంటువ్యాధి.  డిసీజ్‌ ఎక్స్‌లో X అంటే భవిష్యత్తులో ఉద్భవించే పెను మహమ్మారిగా చెబుతున్నారు. దీనివల్ల  తీవ్రమైన అంటువ్యాధులు వ్యాప్తి చెందితాయి. ఫలానా వ్యాధి అని నిర్ధారించకపోయినప్పటికీ.. ఈ మహమ్మారి మాత్రం ఊహించని డ్యామేజ్ చేయబోతుంది. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెబుతుంది. ఇది మొదలైతే మాత్రం  ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యాధికి దారితీస్తుందని శాస్త్రవేత్తలు, మెడికల్‌ ఎక్స్‌పర్ట్‌లు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘డిసీజ్‌ ఎక్స్‌’, కరోనా వేరియంట్లతోపాటు ఇతర వ్యాధులను అంచనా వేసేందుకు అప్రమత్తంగా ఉన్నట్లు WHO చెబుతోంది. 21వ శతాబ్దం ఆరంభంలో అంటువ్యాధులు మానవవాళిపై ముప్పేట దాడి చేశాయి. రానున్న రోజుల్లోనూ ఇవి మరింతగా వ్యాప్తిచెందే ఆస్కారం ఉందని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఈడెన్‌బర్గ్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 80ల్లోనే ఎబోలా విజృంభించింది. అప్పుడే ఆ వ్యాధిని గుర్తించి కంట్రోల్‌ చేశారు కానీ.. కొన్నేళ్ల క్రితం మరోసారి ఇది జనాల ప్రాణాలు తీసింది. 1346 -1353AD మధ్య సుమారు 75 మిలియన్ల మంది ప్రాణాలను బలిగొంది బ్లాక్ డెత్ అనే అంటు వ్యాధి. ఇప్పుడు రాబోయే డిసీజ్‌ ఎక్స్‌ కూడా అదే స్కేల్‌లో ఉండొచ్చని WHO అంచనా వేస్తోంది.

అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ కూడా “కొత్త మహమ్మారి యుగం” గురించి ముందే హెచ్చరించాడు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో జనాభా పెరుగుదల, ప్రత్యేకించి మానవ నివాసాలు అటవీ ప్రాంతాల్లోకి ప్రవేశించడం వల్ల.. ఇటువంటి వ్యాధులు పెరుగుతున్నాయన్నారు. అభివృద్ధి ఒకవైపు.. అసహజ సెక్స్ కూడా మరో కారణంగా వైద్య నిపుణలు చెబుతున్నారు. జంతువులతో సెక్స్‌ చేసే వారి నుంచి కొత్త రకాల వైరస్లు పుట్టుకొచ్చే ప్రమాదాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా లేకపోతే.. డిజీస్‌ ఎక్స్‌ సగం జనాభాని ఖతం చేయడం ఖాయం.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu