Viral Video: పిల్ల ఏనుగు కౌగిలింత‌కు మురిసిపోయిన మావటి.. క్యూట్‌ వీడియో చూస్తే మీరూ పడిపోతారు

కుక్క,పిల్లి, ఏనుగుల సరదా చేష్టలు అవి చేసే చిలిపి పనులు నెట్టింట్లో ట్రెండింగ్ లో ఉంటున్నాయి. వీటిని చూడటానికి నెటిజన్లు సైతం ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో బాగా వైరలవుతోంది.

Viral Video: పిల్ల ఏనుగు కౌగిలింత‌కు మురిసిపోయిన మావటి.. క్యూట్‌ వీడియో చూస్తే మీరూ పడిపోతారు
Baby Elephant
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 28, 2022 | 10:04 PM

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వైరల్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. అందులో కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటే మరికొన్ని ఫన్నీగా అనిపిస్తాయి. ముఖ్యంగా కుక్క,పిల్లి, ఏనుగుల సరదా చేష్టలు అవి చేసే చిలిపి పనులు నెట్టింట్లో ట్రెండింగ్ లో ఉంటున్నాయి. వీటిని చూడటానికి నెటిజన్లు సైతం ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో బాగా వైరలవుతోంది. సాధారణంగా ఏనుగులు మనుషులతో చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. అయితే ఇందులో ఓ పిల్ల ఏనుగు దాని సంర‌క్ష‌కుడితో క‌లిసి ఆడుకుంటున్న ఓ హృద‌య‌పూర్వ‌క‌మైన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో పిల్ల ఏనుగు దాని సంర‌క్ష‌కుడిని కౌగిలించుకుంటుంది. ప్రేమ‌గా అత‌డిని తొండంతో నిమురుతుంది. దాని సంర‌క్ష‌క్షుడు సైతం అంతే ప్రేమగా ప‌ట్టుకుని దగ్గరకు తీసుకుంటున్నాడు. అతని ముఖంలో సంతోషంతో నవ్వులు చిందించాడు. ఈ వీడియోను ‘బిటింగెబిడెన్’ అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ‘బేబీ ఏనుగు కౌగిలింత’ అని ఈ వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో నెటిజ‌న్ల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ వీడియోను ల‌క్ష‌కుపైగా మంది లైక్ చేయ‌డం విశేషం.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి