ఓటీటీలో అనుష్క నిశ్శబ్ధం.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!

కరోనా వేళ థియేటర్లు బంద్ అవ్వడంతో చాలా సినిమాలో ఆన్‌లైన్‌లో రిలీజ్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనుష్క నిశ్శబ్ధం కూడా ఆన్‌లైన్‌లో రానుందని ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరు, ప్రముఖ కథా రచయిత కోనా వెంకట్ స్పందించారు. ”నిశ్శబ్ధం రిలీజ్‌పై మీడియాలో గత కొన్ని రోజులుగా పలు రకాల పుకార్లు వినిపిస్తున్నాయి. […]

ఓటీటీలో అనుష్క నిశ్శబ్ధం.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!
Ravi Kiran

| Edited By:

May 22, 2020 | 10:06 PM

కరోనా వేళ థియేటర్లు బంద్ అవ్వడంతో చాలా సినిమాలో ఆన్‌లైన్‌లో రిలీజ్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనుష్క నిశ్శబ్ధం కూడా ఆన్‌లైన్‌లో రానుందని ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరు, ప్రముఖ కథా రచయిత కోనా వెంకట్ స్పందించారు.

”నిశ్శబ్ధం రిలీజ్‌పై మీడియాలో గత కొన్ని రోజులుగా పలు రకాల పుకార్లు వినిపిస్తున్నాయి. దానిపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాం. ఈ సినిమాను థియేటర్‌లో విడుదల చేయడమే మా మొదటి ప్రాధాన్యత. ఒకవేళ పరిస్థితి ఇలానే కొనసాగితే.. అప్పుడు ఆన్‌లైన్ రిలీజ్‌ గురించి ఆలోచిస్తాం. మంచినే జరుగుతుందని ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు.

కాగా థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మాధవన్, అంజలి, శాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్‌ అవసరాల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోనా ఫిలిం కార్పోరేషన్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌, టీజర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. తెలుగు, తమిళం భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Read This Story Also: లాక్‌డౌన్.. రెండు నెలల తరువాత ఇండియాకు వచ్చిన స్టార్ హీరో..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu