వలస కార్మికుల సమస్యలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

వలస కార్మికుల సమస్యలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వలస కూలీలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. పేరు నమోదు చేసుకున్న 48 గంటల్లోగా వారికి బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే 98 గంటల్లో రైలు ఏర్పాటు చేసి స్వస్థలాలకు పంపించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఏజీ మాట్లాడుతూ.. వలస కార్మికుల గురించి చర్యలు తీసుకున్నామని తెలిపారు. దానిపై న్యాయస్థానం స్పందిస్తూ.. సౌకర్యాలు ఏర్పాటు చేస్తే […]

వలస కార్మికుల సమస్యలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
Follow us

| Edited By:

Updated on: May 22, 2020 | 10:06 PM

వలస కార్మికుల సమస్యలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వలస కూలీలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. పేరు నమోదు చేసుకున్న 48 గంటల్లోగా వారికి బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే 98 గంటల్లో రైలు ఏర్పాటు చేసి స్వస్థలాలకు పంపించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఏజీ మాట్లాడుతూ.. వలస కార్మికుల గురించి చర్యలు తీసుకున్నామని తెలిపారు. దానిపై న్యాయస్థానం స్పందిస్తూ.. సౌకర్యాలు ఏర్పాటు చేస్తే కార్మికులు శిబిరాల్లో ఎందుకు ఉండకుండా నడిచి వెళ్లారంటూ చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. విమర్శలకు ఇది సమయం కాదని, వలస కూలీల సమస్యలు మానవతా దృక్పథంతో చూడాలని హైకోర్టు వెల్లడించింది.

Read This Story Also: ఓటీటీలో అనుష్క నిశ్శబ్ధం.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!