AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సల్మాన్‌ ఖాన్‌ని డైరెక్ట్ చేయబోతున్న పూరీ..!

డేరింగ్ అండ్ డ్యాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు. కాగా ఈ మూవీ తరువాత పూరీ జగన్నాథ్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను డైరెక్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన పూరీ.. సల్మాన్‌కు సరిపోయేలా ఓ అద్భుత కథను రాసుకున్నారట. ఇక […]

సల్మాన్‌ ఖాన్‌ని డైరెక్ట్ చేయబోతున్న పూరీ..!
Ravi Kiran
| Edited By: |

Updated on: May 22, 2020 | 10:10 PM

Share

డేరింగ్ అండ్ డ్యాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు. కాగా ఈ మూవీ తరువాత పూరీ జగన్నాథ్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను డైరెక్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన పూరీ.. సల్మాన్‌కు సరిపోయేలా ఓ అద్భుత కథను రాసుకున్నారట. ఇక దీన్ని త్వరలోనే ఆయనకు వినిపించబోతున్నట్లు సమాచారం.

కాగా బాలీవుడ్ పూరీకి కొత్తేం కాదు. గతంలో అమితాబ్‌ బచ్చన్‌తో ‘బుడ్డా హోగా తేరే బాప్’ అనే చిత్రాన్ని పూరీ హిందీలో తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించినప్పటికీ.. ఆ తరువాత మళ్లీ టాలీవుడ్‌లోకి తిరిగి వచ్చారు పూరీ. ఇక ఇప్పుడు విజయ్‌ దేవరకొండ సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తున్న క్రమంలో.. తరువాతి సినిమాను కూడా పాన్‌ ఇండియాగా తీయాలన్న ఆలోచనలో ఈ దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా సల్మాన్ ఖాన్ ప్రస్తుతం కబీ ఈద్ కబీ దీవాళి, రాధ చిత్రాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే.

Read This Story Also: వలస కార్మికుల సమస్యలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ