Kamal Haasan: విడుదలైన విక్రమ్ మూవీ ఫస్ట్ పోస్టర్ .. న్యూ లుక్ లో ఆకట్టుకున్న కమల్

విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం విక్రమ్ . లోకేష్ కనగ రాజ్ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవల మాస్టర్ సినిమాతో సంచలన విజయం అందుకున్న లోకేష్ ఇప్పుడు..

Kamal Haasan: విడుదలైన విక్రమ్ మూవీ ఫస్ట్ పోస్టర్ .. న్యూ లుక్ లో ఆకట్టుకున్న కమల్
Kamal
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 10, 2021 | 7:14 PM

Kamal Haasan: విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం విక్రమ్ . లోకేష్ కనగ రాజ్ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవల మాస్టర్ సినిమాతో సంచలన విజయం అందుకున్న లోకేష్ ఇప్పుడు కమల్ కోసం ఓ అదిరిపోయే కథను సిద్ధం చేసాడు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఇంటర్‏నేషనల్ ఫిలింస్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. అయితే ముందు నుంచి ఈ సినిమా పై అంచనాలు పెంచుతున్నారు మేకర్స్. ఇటీవలే ఈ సినిమా కోసం నేషనల్ అవార్డు టెక్నిషియన్ ను రంగంలోకి దించారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ విక్రమ్ సినిమా కోసం కెమెరాను క్రాంక్ చేయడానికి ముందుకు వచ్చారు.

తాజాగా విడుదల చేసిన ఫస్ట్ పోస్టర్ ఆకట్టుకుంది. ఈ పోస్టర్ లో గడ్డం తో గుబురు మీసం తో రఫ్ లుక్ లో కనిపిస్తున్నారు కమల్. బ్లాక్ అండ్ వైట్ కలర్ లో మూడు కోణాలలో కమల్ ఫేస్ మాత్రమే కనిపించేలా పోస్టర్ ను డిజైన్ చేశారు. ఈ పోస్టర్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన దర్శకుడు లోకేష్ కనగ రాజ్… యుద్ధంతో అదిగో అదిగో వెలుగు..శబ్ధంతో అరాచకత్వం నాశనం..రక్తంతో అదిగో దొర్లుతున్న తల..ఇదిగో కనిపిస్తోంది చూడు స్వర్గం.. కంపిస్తున్న భుజం..గెలుపు నిజం అంటూ రాసుకొచ్చారు. అలాగే ఈ సినిమాలో విలన్ గాప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్  నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Kathi Mahesh Dies: బిగ్ బాస్ ఫేమ్, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ కన్నుమూత

Madhuri Dixit: సీనియర్ నటికి ఆర్ధికంగా అండగా నిలబడిన డ్యాన్స్ దీవానే టీమ్.. రూ.5 లక్షలు అందించిన మాధురీ దీక్షిత్

Acharya Poster: ఆచార్య మూవీ నుంచి అదిరిపోయే పోస్టర్.. ఆకట్టుకుంటున్న చరణ్ లుక్