AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతీయులకు అన్ని విధాలుగా అండగా ఉంటాః జో బైడెన్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రత్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై విరుచుకుపడ్డారు.

భారతీయులకు అన్ని విధాలుగా అండగా ఉంటాః జో బైడెన్
Balaraju Goud
|

Updated on: Oct 24, 2020 | 5:59 PM

Share

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రత్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా భారతీయుల పట్ల ట్రంప్ ప్రేమ ఫోటోలకే పరిమితమన్నారు. ‘ట్రంప్‌ ఓ జాత్యాహంకారి.. మాయమాటలతో అధికారంలోకి వచ్చి.. తన విధానాలతో భారతీయ అమెరికన్లను ఇబ్బందులకు గురిచేశాడు.. అమెరికాలో జరిగిన జాత్యాహంకార దాడులకు అతడి వైఖరే ప్రధాన కారణం.. భారతీయ అమెరికన్లంటే ఆయనకు అస్సలు పడదు.. వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించండి.. నేను అధికారంలోకి వస్తే అన్ని రంగాల్లో భారత్‌తో కలిసి పనిచేస్తా..’ అంటూ జో బైడెన్ అన్నారు. శనివారం భారతీయ అమెరికన్లతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు..

‘ఉగ్రవాద నిర్మూలన విషయంలో భారత్‌తో కలిసి పనిచేస్తామని బైడెన్ స్పష్టం చేశారు. చైనాయే కాదు.. మరే ఇతర దేశం కూడా సరిహద్దు దేశాల్లో అలజడులు సృష్టించకుండా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. అంతేకాదు.. భారతీయ అమెరికన్లతో నాకు ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయన్నారు. అంతేకాదు అమెరికాలోని కాలేజీలు, యూనివర్శిటీల్లో ట్యూషన్ ఫీజును లక్షా 25వేల డాలర్లలోపే ఉండేలా చర్యలు తీసుకుంటామన్న బైడెన్.. దీని వల్ల వేలాది భారతీయ అమెరికన్ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు.

అంతేకాదు, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ పై విరుచుకుపడ్డారు. భారత్- అమెరికా మధ్య సంబంధాల విషయంలో ట్రంప్ కేవలం ఫొటోలకే పరిమితమయ్యారు. ఆయా అంశాల్లో ఇరు దేశాలు సంతృప్తికరమైన ఫలితాన్ని పొందేలా చేస్తా.. నేను కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష పదవికి నామినేట్ చేసినప్పుడు మీరు బాగా సంతోషించారని నాకు తెలుసు.. ఆమె కథ… మీ కథ ఒక్కటే..’ .. అంటూ భారతీయ అమెరికన్లను ఉద్దేశించి జో బైడెన్ ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో తనకు మద్ధతుగా నిలిచి గెలిపించాల్సిందిగా ఆయన ఇండియన్ అమెరికన్లను కోరారు.