దిగ్బల యోగం..ఆ రాశుల వారికి ఆదాయ వృద్ధి, ఉద్యోగ పదోన్నతులు ఖాయం..!
Digbala Yoga: జ్యోతిషశాస్త్రంలో దిగ్బల రాజ యోగానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. సొంత రాశిలో బుధుడు లేదా గురువు, చతుర్థ స్థానంలో శుక్రుడు లేదా చంద్రుడు, సప్తమ స్థానంలో శని, దశమ స్థానంలో కుజుడు లేదా రవి ఉన్నప్పుడు దిగ్బల యోగం పడుతుంది. దీని వల్ల రెట్టింపు బలంతో, రెట్టింపు వేగంతో ధన యోగాలు, రాజ యోగాలు పనిచేస్తాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ దిగ్బలం పట్టిన కాలంలో తప్పనిసరిగా ఏదో ఒక విధమైన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పైకి రావడం, వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపట్టడం, ఆదాయం వృద్ధి చెందడం, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం, ఆరోగ్యం మెరుగుపడడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ప్రస్తుతం దిగ్బల యోగం పట్టిన రాశుల్లో వృషభం, మిథునం, కన్య, ధనుస్సు, మీన రాశులు ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5