IND vs NZ: కివీస్‌కు కలిసిరాని టాస్‌.. వరుసగా నాలుగోసారి ఓడిపోవడంపై నీషమ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

భారత్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్‌ జట్టుకు టాస్‌ అసలు కలిసిరావడం లేదు. ఇంతకు ముందు జరిగిన మూడు టీ 20 మ్యాచ్‌ల సిరీస్‌లోనూ కివీస్‌ ఒక్కసారి కూడా టాస్‌ గెలవలేదు..

IND vs NZ: కివీస్‌కు కలిసిరాని టాస్‌.. వరుసగా నాలుగోసారి ఓడిపోవడంపై నీషమ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
Follow us
Basha Shek

|

Updated on: Nov 25, 2021 | 6:42 PM

భారత్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్‌ జట్టుకు టాస్‌ అసలు కలిసిరావడం లేదు. ఇంతకు ముందు జరిగిన మూడు టీ 20 మ్యాచ్‌ల సిరీస్‌లోనూ కివీస్‌ ఒక్కసారి కూడా టాస్‌ గెలవలేదు. దీంతో ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ఆధిపత్యం వహించి కివీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది టీమిండియా. తాజాగా కాన్పూర్‌ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులోనూ న్యూజిలాండ్‌ మరోసారి ఓడిపోయింది. కాగా న్యూజిలాండ్‌ వరుసగా నాలుగోసారి టాస్‌ గెలవకపోవడంపై ఆ జట్టు ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ నీషమ్‌ సోషల్‌ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ సందర్భంగా ‘నాకెందుకో ఏదో జరుగుతుందని అనుమానం ఉంది. ఎవరైనా వెళ్లి టాస్‌ కాయిన్‌ను దగ్గరి నుంచి పరిశీలించండి ‘ అని ట్విట్టర్‌ వేదికగా ఫన్నీ కామెంట్లు పెట్టాడు నీషమ్‌. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గురువారం ప్రారంభమైన కాన్పూర్‌ టెస్ట్‌లో టీమిండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు సాధించింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజాలు అర్ధ సెంచరీలతో కదం తొక్కడంతో తొలిరోజు టీమిండియానే ఆధిపత్యం సాగించింది .

Also Read:

IND vs NZ: రహానె షాట్ ఎంపికపై లక్ష్మణ్ స్పందన.. అలా ఎలా ఆడతావంటూ ప్రశ్న..

IND vs NZ: తొలి రోజు ఆట ముగిసే సమయానికి 258 పరుగులు చేసిన భారత్.. రాణించిన గిల్, శ్రేయాస్, జడేజా..

Inv Vs Nz: తొలి టెస్ట్‎లో హాఫ్ సెంచరీ చేసిన శ్రేయాస్.. భారీ స్కోర్ దిశగా భారత్..