IND Vs NZ: తొలి టెస్ట్‌లో హాఫ్ సెంచరీ చేసిన శ్రేయాస్.. భారీ స్కోర్ దిశగా భారత్..
టీం ఇండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ తన తొలి టెస్ట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులోశ్రేయాస్ అయ్యర్ 136 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 75 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు...
టీం ఇండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ తన తొలి టెస్ట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులోశ్రేయాస్ అయ్యర్ 136 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 75 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ఈ టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా పంపింది. 13 పరుగులు చేసిన అగర్వాల్ జేమీసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
తర్వాత వచ్చిన పుజారా గిల్‌తో కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. శుభ్‌మన్ గిల్ 93 బంతుల్లో 52 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత పుజారా 26, రహానె 35 పరుగులకే వెనుదిరిగారు. శ్రేయాస్ అయ్యర్ ఎలాంటి తడబాటు లేకుండా జడేజాతో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో జడేజా కూడా ఆఫ్ సెంచరీ చేశాడు. 99 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో జేమిసన్ మూడు వికెట్లు, టిమ్ సౌథి ఒక్క వికెట్ పడగొట్టారు.