IND vs NZ: పాత సంప్రదాయానికి వెల్‌కం చెప్పిన రాహుల్ ద్రవిడ్.. శ్రేయాస్‌కు కలిసొచ్చిన కేఎల్ రాహుల్ గాయం
Shreyas Iyer: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయపడటంతో శ్రేయాస్ అయ్యర్‌కు అరంగేట్రం చేసే అవకాశం లభించింది. భారత టెస్టు జట్టులోకి రెండోసారి ఎంపికయ్యాడు.
India Vs New Zealand 2021: మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ గురువారం శ్రేయాస్ అయ్యర్‌కు భారత ‘టెస్ట్ క్యాప్’ అందించాడు. ఈ విధంగా, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ గౌరవనీయమైన టోపీని భారత క్రికెట్‌లోని ప్రముఖుల నుంచి డెబ్యూ ఆటగాళ్లకు అందించే పాత సంప్రదాయాన్ని పునరుద్ధరించాడు. భారత్ నుంచి టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన 303వ ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. న్యూజిలాండ్‌పై టాస్‌కు ముందు, దిగ్గజ బ్యాట్స్‌మెన్ గవాస్కర్ అతనికి క్యాప్ ఇచ్చాడు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ద్రవిడ్ మాజీ దిగ్గజం గవాస్కర్‌ను ఆశ్వానించాడు. అంతకుముందు టీ20ఐ సిరీస్ సమయంలో, ద్రవిడ్, అత్యంత విజయవంతమైన భారత పరిమిత ఓవర్ల బౌలర్‌లలో ఒకరైన అజిత్ అగార్కర్, డెబ్యూ హర్షల్ పటేల్‌కు జాతీయ జట్టు క్యాప్‌ను అందించిన సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియన్ మాజీ ఆటగాళ్ల నుంచి జాతీయ టోపీని పొందడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా, షేన్ వార్న్, మార్క్ వా, మార్క్ టేలర్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ వంటి అనుభవజ్ఞులు కొత్త ఆటగాళ్లకు ఆస్ట్రేలియా బ్యాగీ గ్రీన్ టోపీని ఇచ్చేవారు. భారతదేశంలో కూడా, ఇంతకుముందు అలాంటి సంప్రదాయం ఉంది. కానీ, కొంతకాలం కెప్టెన్ లేదా సీనియర్ ఆటగాడు లేదా సహాయక సిబ్బంది మాత్రమే అరంగేట్రం ఆటగాడికి టోపీని అందజేసేవారు. ద్రవిడ్ తనను తాను సంప్రదాయవాదిగా నిరూపించుకున్నాడు. అయ్యర్‌కి టెస్ట్ క్యాప్ ఇవ్వడానికి సునీల్ గవాస్కర్‌ను పిలిచినందుకు ఇది కూడా ఒక కారణంగా తెలుస్తోంది. క్యాప్ ఇస్తున్నప్పుడు గవాస్కర్ డెబ్ల్యూ ప్లేయర్ అయ్యర్‌తో ఏదో చెప్పాడు. టెస్టు జట్టులోని కొత్త బ్యాట్స్‌మెన్ దానిని శ్రద్ధగా వింటున్నట్లు కనిపించాడు. తర్వాత క్యాప్ తీసుకుని ముద్దుపెట్టుకున్నాడు.
రాహుల్ గాయంతో అయ్యర్‌కి అవకాశం.. కేఎల్ రాహుల్ గాయపడటంతో శ్రేయాస్ అయ్యర్‌కు అరంగేట్రం చేసే అవకాశం లభించింది. భారత టెస్టు జట్టులోకి రెండోసారి ఎంపికయ్యాడు. అంతకుముందు 2017లో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీకి ప్రత్యామ్నాయంగా వచ్చాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అప్పుడు కూడా అజింక్యా రహానే జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే కర్ణాటక నుంచి వచ్చిన అనిల్ కుంబ్లే జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం కర్ణాటకకు చెందిన రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్నాడు. ధర్మశాలలో ఆడిన ఆ టెస్టులో, రహానే ఒక బౌలర్‌కు అవకాశం ఇవ్వడంతో, అయ్యర్ తన అరంగేట్రం చేయలేకపోయాడు.
26 ఏళ్ల శ్రేయాస్ అయ్యర్ ముంబై తరఫున దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నాడు. గత నాలుగేళ్లుగా భారత జట్టులో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. డిసెంబర్ 2017లో శ్రీలంకపై, నవంబర్ 2017లో న్యూజిలాండ్‌తో జరిగిన T20Iలో తన ODI అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.