AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Australia: ప్రపంచంలోనే బెస్ట్ కీపర్ అతను.. ప్లేయింగ్‌ XIలో తప్పకుండా ఉండాల్సిందే: ఆస్ట్రేలియా స్పిన్నర్

Nathan Lyon- Tim Paine: నా దృష్టిలో టిమ్ దేశంలో, ప్రపంచంలోనే అత్యుత్తమ కీపర్, ఆస్ట్రేలియన్ టీం మొత్తం అతనికి పూర్త మద్దతు ఇస్తుంది.

Australia: ప్రపంచంలోనే బెస్ట్ కీపర్ అతను.. ప్లేయింగ్‌ XIలో తప్పకుండా ఉండాల్సిందే: ఆస్ట్రేలియా స్పిన్నర్
Venkata Chari
|

Updated on: Nov 25, 2021 | 1:43 PM

Share

The Ashes 2021-22: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ టిమ్ పైన్‌తో యాషెస్ సిరీస్‌ ముందు పెద్ద దుమారే రేగింది. అయితే ఇలాంటి ఆస్ట్రేలియా టీంకు ఎలాంటి ఆటంకాలు కలిగించవని ఆ టీం బౌలర్ నాథన్ లియాన్ అన్నారు. అయితే “ప్రపంచంలోని అత్యుత్తమ గ్లోవ్‌మెన్” అంటూ పైన్‌కు కితాబిచ్చాడు. సెక్స్టింగ్ కుంభకోణం కారణంగా గత వారం కెప్టెన్సీని వదులుకున్న పైన్‌కు ఆస్ట్రేలియా జట్టు “100 శాతం” మద్దతు ఉందని లియాన్ పేర్కొనడం విశేషం.

400 టెస్టు వికెట్ల మైలురాయిని చేరుకోవడానికి మరొక వికెట్ దూరంలో నిలిచిన నాథన్ లియోన్ మాట్లాడుతూ.. “నా దృష్టిలో టిమ్ దేశంలో, ప్రపంచంలోనే అత్యుత్తమ కీపర్, ఆస్ట్రేలియన్ టీం మొత్తం అతనికి పూర్త మద్దతు ఇస్తుంది. నేను అతనిని వేరేలా చూడను. గబ్బా టెస్ట్ మ్యాచ్‌కి రండి. మొత్తం సిరీస్‌లో మేం ప్రొఫెషనల్ క్రీడాకారులుగా బరిలోకి దిగనున్నాం. టిమ్ తప్పు చేశాడు. అది నాకు నిజాయితీగా ఉండేందకు గొప్ప ధైర్యాన్ని చూపుతుంది. టిమ్‌కి నా పూర్తి మద్దతు అందిస్తున్నాను. మేం క్వారంటైన్ నుంచి బయటపడిన వెంటనే అతనిని కలిసేందుకు ఎదురుచూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

“సెలెక్టర్లు తాము అందుబాటులో ఉన్న అత్యుత్తమ ప్లేయంగ్‌ XIని ఎంపిక చేస్తారు. నా దృష్టిలో టిమ్ పైనే ప్రపంచంలో అత్యుత్తమ కీపర్ అని పేర్కొన్నాడు. నాకు అతను కావాలి. ఇది చాలా స్వార్థపూరితమైనది కావొచ్చు. బౌలర్ దృష్టిలో అత్యుత్తమ గ్లోవ్‌మ్యాన్‌ను కోరుకుంటున్నాను’ అని వెల్లడించాడు.

మెడ శస్త్రచికిత్స నుంచి తిరిగి వచ్చిన పైన్, ప్రస్తుతం దక్షిణ ఆస్ట్రేలియాతో జరిగిన టాస్మానియా రెండవ ప్లేయింగ్‌ XIలో భాగంగా ఉన్నాడు. తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకునే ప్రయత్నంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన తస్మానియా వన్డే కప్ గేమ్‌లో కూడా పాల్గొంటాడు.

క్రికెట్ ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు కెప్టెన్‌గా పాట్ కమిన్స్‌ను, వైస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్‌ను ప్రకటించే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితం ఈ ఇద్దరి ఆటగాళ్లకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

Also Read: ఏడేళ్ల క్రితం కాన్పూర్‌లోనే కెరీర్ మేకింగ్ ఇన్నింగ్స్.. ప్రస్తుతం టెస్ట్‌ డెబ్యూ కూడా ఇక్కడే.. చారిత్రాత్మకంగా నిలిపేందుకు శ్రేయాస్ ఆరాటం..!

IND vs NZ 1st Test: ప్రమాదంలో భజ్జీ రికార్డు.. అశ్విన్ ముందు అద్భుత అవకాశం.. ధోనీని అధిగమించేందుకు రహానె‌కు ఛాన్స్..!