IND vs NZ: రహానె షాట్ ఎంపికపై లక్ష్మణ్ స్పందన.. అలా ఎలా ఆడతావంటూ ప్రశ్న..
కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో కెప్టెన్ రహానె ఆట తీరును మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తప్పుబట్టాడు. రహానె షాట్ ఎంపికపై అభ్యంతరం వ్యక్తం చేశాడు...
కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో కెప్టెన్ రహానె ఆట తీరును మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తప్పుబట్టాడు. రహానె షాట్ ఎంపికపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ టెస్ట్‌లో రహానె 35 పరుగులు చేశాడు. అంజిక్యా రెండో సెషన్‌లో కైల్ జేమీసన్ బౌలింగ్‌లో ఒక కట్ షాట్ ఆడేందుకు యత్నించి అవుటయ్యాడు. ఆఫ్-స్టంప్ వెలుపల వచ్చిన బంతిని కట్ చేయడానికి రహానె ప్రయత్నించాడంతో బౌల్డ్ అయ్యాడు.
“అజింక్యా రహానె క్రీజులోకి వచ్చిన వెంటనే కైల్ జేమీసన్ షార్ట్ పిచ్ డెలివరీలు వేయడం మొదలు పెట్టాడు. షార్ట్-పిచ్ డెలివరీలను ఎదుర్కొవడానికి రహానెకు ఒకే ఒక ఎంపిక ఉందని మాకు తెలుసు. కానీ ఆ బంతిని పుల్ షాట్ ఆడడం సరికాదు.” అని లక్ష్మణ్ అన్నాడు. లంచ్ తర్వాత జేమీసన్ రహానేను ఇబ్బంది పెట్టాడని న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ చెప్పాడు.
“ఈ విధమైన పిచ్‌లు, మీరు చాప్-ఆన్‌ను చాలా తరచుగా చూస్తారు. మేము ఈరోజు ఇప్పటికే 2 చూశాము. ఒకటి శుభ్‌మాన్ గిల్‌కు మంచి డెలివరీ. కానీ రహానెకి లభించినది గొప్ప డెలివరీ కాదు.” అని లక్ష్మణ్ చెప్పాడు. ఇదిలా ఉండగా, టెస్ట్ మ్యాచ్ సందర్భంగా రహానే తన ఫామ్‌పై ఉన్న ఆందోళనలను పక్కనపెట్టాలన్నాడు. బ్యాటర్‌గా రహానే మరోసారి విఫలం కావడంతో సోషల్ మీడియాలో వేదికగా క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
Read Also.. IND vs NZ: తొలి రోజు ఆట ముగిసే సమయానికి 258 పరుగులు చేసిన భారత్.. రాణించిన గిల్, శ్రేయాస్, జడేజా..