Paytm: కోలుకుంటున్న పేటీఎం.. వరుసగా మూడో రోజు పెరిగిన షేరు ధర.. అయినా నష్టాల్లోనే..

స్టాక్ మార్కెట్‎లో లిస్టింగ్ రోజు నుంచి నష్టాల్లో కొనసాగిన పేటీఎం గత మూడు రోజులుగా పెరుగుతూ వస్తుంది. పెట్టుబడిదారులు తమ కొనుగోలు ధరను సగటు చేయడానికి ప్రయత్నిస్తుండంతోనే షేరు పెరుగుతున్నట్లు విశ్లేషకులు విశ్వసిస్తున్నారు....

Paytm: కోలుకుంటున్న పేటీఎం.. వరుసగా మూడో రోజు పెరిగిన షేరు ధర.. అయినా నష్టాల్లోనే..
Paytm
Follow us

|

Updated on: Nov 25, 2021 | 6:28 PM

స్టాక్ మార్కెట్‎లో లిస్టింగ్ రోజు నుంచి నష్టాల్లో కొనసాగిన పేటీఎం గత మూడు రోజులుగా పెరుగుతూ వస్తుంది. పెట్టుబడిదారులు తమ కొనుగోలు ధరను సగటు చేయడానికి ప్రయత్నిస్తుండంతోనే షేరు పెరుగుతున్నట్లు విశ్లేషకులు విశ్వసిస్తున్నారు. Paytm ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌లో చాలా మంది యాంకర్ ఇన్వెస్టర్లు షేర్లు రూ.1,272కి పడిపోయిన తర్వాత తమ వాటాను పెంచుకునే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. అయితే BlackRock, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ మంగళ, బుధవారాల్లో మరిన్ని Paytm షేర్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో షేరు ధర పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

గురువారం BSEలో పేటీఎం షేరు 2.48 శాతం పెరిగి రూ.1,796కు పెరిగింది. ఈ షేరు నవంబర్ 22న దాని ఆల్-టైమ్ కనిష్ఠ స్థాయి రూ.1,271.25కు పడిపోయింది. అప్పటి నుంచి 45 శాతం పెరిగింది. అయితే పేటీఎం ఇప్పిటికి నష్టాల్లో ఉంది. దీన్ని ఐపీవోలో రూ. 2,150కు కొనుగోలు చేశారు. ప్రస్తుతం రూ.1,796గా ఉంది. అంటే దాదాపు 20 తక్కువలో ఉంది. ఎందుకంటే షేరుకు ఎక్కువ ధర నిర్ణయించడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. బ్రోకరేజ్ సంస్థ Macquarie Paytm వ్యాపార నమూనా దృష్టి బట్టి రూ. 1,200 లక్ష్య ధరతో తక్కువ పనితీరు రేటింగ్‌ ఇచ్చింది.

Read Also.. Nitin Gadkari: EV విప్లవం దగ్గరలోనే ఉంది.. రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయి..