Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nitin Gadkari: EV విప్లవం దగ్గరలోనే ఉంది.. రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయి..

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించమని ప్రోత్సహిస్తున్నప్పటికీ  దేశంలో వాటి వాడకం తక్కువగానే ఉంది. దీనికి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు ఎక్కువగా ఉండడం కూడా ఒక్క కారణంగా చెప్పొచ్చు...

Nitin Gadkari: EV విప్లవం దగ్గరలోనే ఉంది.. రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయి..
Gdkari
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 25, 2021 | 3:54 PM

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించమని ప్రోత్సహిస్తున్నప్పటికీ  దేశంలో వాటి వాడకం తక్కువగానే ఉంది. దీనికి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు ఎక్కువగా ఉండడం కూడా ఒక్క కారణంగా చెప్పొచ్చు. పెట్రోల్, డీజిల్ వాహనాల మాదిరిగానే ఎలక్ట్రిక్ వాహనాల ధరను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. EV విప్లవం ఎంతో దూరంలో లేదని అన్నారు. వర్చువల్‎గా నిర్వహించిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ FY21 AGM వార్షిక సదస్సులో గడ్కరీ ప్రసంగించారు. “రెండేళ్లలో, EVల ధరలు పెట్రోల్, డీజిల్ వాహనాలతో సమానంగా ఉండే స్థాయికి తగ్గుతాయి” అని గడ్కరీ పేర్కొన్నారు. EV ఛార్జింగ్ సౌకర్యాలను విస్తరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు.

“మేము 2023 నాటికి ప్రధాన రహదారులపై 600 EV ఛార్జింగ్ పాయింట్‌లను ఏర్పాటు చేస్తున్నాము. ఛార్జింగ్ స్టేషన్‌లు సౌర లేదా పవన విద్యుత్ వంటి పునరుత్పాదక వనరుల ద్వారా శక్తిని పొందేలా చూడాలని ప్రభుత్వం కోరుకుంటోంది” అని ఆయన చెప్పారు. “EVల సంఖ్య తక్కువగా ఉన్నందున వాటి ధర ఎక్కువగా ఉంది” అని గడ్కరీ అన్నారు. భారతదేశం EV విప్లవం కోసం ఎదురుచూస్తోందని, 250 స్టార్టప్ వ్యాపారాలు తక్కువ ఖర్చుతో కూడిన EV సాంకేతికత సృష్టిలో నిమగ్నమై ఉన్నాయని ఆయన అన్నారు. ప్రధాన వాహన తయారీదారులు EV ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు. EVలపై GST 5% మాత్రమే ఉందని, లిథియం-అయాన్ బ్యాటరీల ధర కూడా తగ్గుతోందన్నారు.

పెట్రోల్‌తో నడిచే కారు కిలోమీటరుకు రూ. 10 ఖర్చయితే, డీజిల్ కిలోమీటరుకు రూ. 7, ఎలక్ట్రిక్ కిలోమీటరుకు రూ. 1 మాత్రమే ఖర్చు అవుతుందని గడ్కరీ తెపారు. గ్యాసోలిన్, డీజిల్ వంటి సాంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఇథనాల్, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) వంటి వాటిని ఉపయోగించాలని చెప్పారు.

Read Also..  RBI: టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్‎కు రూ.2.54 కోట్ల జరిమానా విధించిన ఆర్బీఐ..