తాడిపత్రిలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. మరోసారి ఘాట వ్యాఖ్యలు చేసిన పెద్దారెడ్డి..!

తాడిపత్రి రాజకీయం అదే రేంజ్‌లో సాగుతుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో మరింత కాకా పుట్టిస్తున్నారు.

తాడిపత్రిలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. మరోసారి ఘాట వ్యాఖ్యలు చేసిన పెద్దారెడ్డి..!
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 29, 2020 | 2:09 PM

తాడిపత్రి రాజకీయం అదే రేంజ్‌లో సాగుతుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో మరింత కాకా పుట్టిస్తున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒక ఛానల్‌లో చేసిన ఘాటు వ్యాఖ్యలు మరోసారి ఈ ఉద్రిక్తతకు అజ్యం పోసినట్లైంది. మరోసారి జేసి ఫ్యామిలీకి మాత్రం చాలా బలంగా వార్నింగ్ ఇచ్చేసారు. ఇన్నాళ్ళు చర్చలకే కట్టుబడి ఉన్నా. ఇక నుంచి ఏదైనా చేయడానికి సిద్దంగా ఉన్నా అంటూ ఘాటుగా కామెంట్ చేశారు. ఇదిలావుంటే. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత జేసి ఫ్యామిలీ చాలా బలహీనంగా కనపడుతుంది. కేసులతో అధికార పార్టీ బాగా ఇబ్బంది పెడుతుంది. అసలు జేసి ఫ్యామిలీ గొడవలు చేసినట్టు వైసీపీ అనుకూల మీడియాలో కూడా ఎక్కడా కనపడలేదు.

కానీ, పెద్దారెడ్డి మాత్రం ఆవేశపూరితంగా వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టారని అంటున్నారు. అంతేకాదు కారుతో ఢీకొట్టి చంపాలని చూసారని పోలీసులు కూడా కేసులు నమోదు చేసారు. కానీ జేసి ఫ్యామిలీ మీద పోలీసులు పెట్టింది ఎస్సీ ఎస్టీ కేసు మాత్రమే. జేసి ఫ్యామిలీ రెచ్చగొడితే పోలీసులు కేసులు పెట్టి ఉండాల్సింది. అలా ఎక్కడా జరగలేదు. మరి పెద్దారెడ్డి ఎవరిని రెచ్చగొట్టడానికి ఈ విధంగా వ్యాఖ్యలు చేసారో ఆయనకే తెలియాలి. ధర్మవరం రేప్ ఘటనను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసి… ఇప్పుడు మరో విధ్వంశంకు శ్రీకారం చుట్టారనే ఆరోపణలు వినపడుతున్నాయి.