AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది…వైఎస్‌ఆర్‌ రైతు భరోసా నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి జగన్ మరోసారి స్పష్టం చేశారు. రైతుల ఖాతాల్లోకి పంట పెట్టుబడి రాయితీతో పాటు.. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా నిధులను విడుదల....

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది...వైఎస్‌ఆర్‌ రైతు భరోసా నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్
Sanjay Kasula
|

Updated on: Dec 29, 2020 | 2:03 PM

Share

YSR Rythu bharosa Funds : రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి జగన్ మరోసారి స్పష్టం చేశారు. రైతుల ఖాతాల్లోకి పంట పెట్టుబడి రాయితీతో పాటు.. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడారు.. నివర్ తుపానుతో నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ సైతం ఇస్తున్నట్టు తెలిపారు.

రైతులకు మంచి ధరలు రావాలనేదే లక్ష్యమన్న ముఖ్యమంత్రి.. వారి ఖాతాల్లో రూ.1,766 కోట్ల నిధులు జమ చేస్తున్నట్లుగా తెలిపారు. వారి కోసం 18 నెలల కాలంలో రూ.61,400 కోట్లు వెచ్చించామని అన్నారు. 8 లక్షల 34 వేల మంది రైతులకు రూ.646 కోట్ల పెట్టుబడి రాయితీ అందించనున్నట్లు వెల్లడించారు. రైతుభరోసా మూడో విడత కింద రూ.1,120 కోట్లు రైతులకు ఇస్తున్నట్లుగా సీఎం జగన్ పెర్కొన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.13,500 రైతు భరోసాగా ఇస్తున్నామన్నారు. రైతుల నుంచి రూపాయి మాత్రమే తీసుకుని పంటలకు బీమా కల్పిస్తున్నామని చెప్పారు. పగటిపూట 9 గంటల విద్యుత్ కోసం రూ.1700 కోట్లు వెచ్చించామన్న ముఖ్యమంత్రి.. 18 నెలల్లో రైతుల కోసం 61 వేల 400 కోట్లు ఖర్చుచేసినట్లు తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ పథకం శాశ్వతంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.