Janasena worry: జగన్ దెబ్బకు జనసేనలో వర్రీ
Janasena suffers with new worry as Jagan moving closure to BJP: ఏపీలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు జనసేన పార్టీలో కొత్త గుబులు రేపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జగన్ ఢిల్లీ టూర్లతో ప్రతిపక్ష టీడీపీ హడలిపోతుందో లేదో తెలియదు. కానీ బీజేపీకి జగన్ క్లోజ్ అయితే తమ పరిస్థితి ఏంటని జనసేన నేతలు తెగ హడలిపోతున్నారట. తాము తీసుకున్న స్టెప్‌తో రాజకీయంగా తమ పరిస్థితి ఏంటి? అని ఆ పార్టీ నేతలు తెగ ఫీలైపోతున్నారట. […]
Janasena suffers with new worry as Jagan moving closure to BJP: ఏపీలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు జనసేన పార్టీలో కొత్త గుబులు రేపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జగన్ ఢిల్లీ టూర్లతో ప్రతిపక్ష టీడీపీ హడలిపోతుందో లేదో తెలియదు. కానీ బీజేపీకి జగన్ క్లోజ్ అయితే తమ పరిస్థితి ఏంటని జనసేన నేతలు తెగ హడలిపోతున్నారట. తాము తీసుకున్న స్టెప్‌తో రాజకీయంగా తమ పరిస్థితి ఏంటి? అని ఆ పార్టీ నేతలు తెగ ఫీలైపోతున్నారట.
జనసేనలో సీఎం జగన్ ఢిల్లీ టూర్లు హట్ టాపిక్‌గా మారాయి. బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాలని జనసేన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ పెద్దలను కలిశారు. రెండు సార్లు సమన్వయ కమిటీ సమావేశాలు జరిగాయి. జనసేనాని టూర్ల మీద టూర్లు చేస్తున్నారు. ఈలోపు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. రెండ్రోజుల్లోనే మరోసారి ఢిల్లీ వెళ్ళారు. ఈసారి భేటీ కేంద్రంలో నెంబర్ టూ అయిన అమిత్‌షాతో. కేంద్రమంత్రివర్గంలో వైసీపీ చేరుతుందని ప్రచారం నడుస్తోంది. దీంతో జనసేన నేతలకు టెన్షన్ పట్టుకుంది.
బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయిస్తే ఇలా బీజేపీ తమకు ఝలక్‌లు ఇస్తుందని ఊహించలేదని కొందరు జనసేన నేతలు వాపోతున్నారు. వైసీపీ సర్కార్‌తో బీజేపీ పాజిటివ్ రిలేషన్స్ మెయిన్‌టెయిన్ చేస్తోంది. దీంతో తమకు ఇబ్బంది వస్తుందని జనసేన నేతలు అంటున్నారు. మరోవైపు ఇటు జనసేన నేతలకు ఇంకో సమస్య వచ్చి పడిందట. ఇంతకుముందు టీవీ చర్చల్లో లేకపోతే…ఇతర సమావేశాల్లో బీజేపీ నేతలతో పాటు జనసేన నేతలను కూడా పిలిచేవారట. అయితే బీజేపీతో కలిసి తర్వాత జనసేన నేతలకు కొన్ని సమావేశాలకు ఆహ్వానాలు వెళ్లడం లేదట.
Also read: Key point of Jagan and Amith Shah meeting
ఇటు టీవీ చర్చల్లో కూడా జనసేన పార్టిసిఫేషన్ తగ్గిపోయిందట. ఏం జరిగిందని ఆరా తీస్తే బీజేపీ, జనసేన సేమ్ వాయిస్ వినిపిస్తాయి కాబట్టి ఇద్దరు నేతలెందుకు అని మీడియా సమన్వయకర్తలు అంటున్నారట. దీంతో జనసేన నేతలు తమకు ప్రియారిటీ తగ్గిపోయిందని తెగ బాధపడుతున్నారట. ఇటు బీజేపీకి జగన్ దగ్గరవుతున్నారు. దీంతో తాము ఆటలో అరటి పండు మాదిరిగా మారిపోయామా? చివరకు తమకు బీజేపీ ప్రియారిటీ ఇస్తుందా? లేదా? బీజేపీ పొలిటికల్ గేమ్ ఏంటి? అనే చర్చ జనసేనలో నడుస్తోంది.