Antarctica Temperature: అంటార్కిటికాలో రికార్డు ఉష్ణోగ్రత.. మంచు ఖండం వేడెక్కుతోందా?

Antarctica Temperature: ఫిబ్రవరి 9 న, అంటార్కిటికా ద్వీపకల్పంలోని సైమౌర్ ద్వీపంలో రికార్డు స్థాయిలో 20.75 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు బ్రెజిలియన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటివరకు అంటార్కిటికా ఖండంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రతగా వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా ఇప్పటి వరకూ ఈ ఖండంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్‌ అని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే వాతావరణ మార్పులే దీనికి కారణమని చెప్పలేమని వారు అంటున్నారు. అత్యంత శీతల ప్రదేశమైన అంటార్కిటికాలో ఈ విధంగా […]

Antarctica Temperature: అంటార్కిటికాలో రికార్డు ఉష్ణోగ్రత.. మంచు ఖండం వేడెక్కుతోందా?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 14, 2020 | 7:28 PM

Antarctica Temperature: ఫిబ్రవరి 9 న, అంటార్కిటికా ద్వీపకల్పంలోని సైమౌర్ ద్వీపంలో రికార్డు స్థాయిలో 20.75 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు బ్రెజిలియన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటివరకు అంటార్కిటికా ఖండంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రతగా వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా ఇప్పటి వరకూ ఈ ఖండంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్‌ అని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే వాతావరణ మార్పులే దీనికి కారణమని చెప్పలేమని వారు అంటున్నారు. అత్యంత శీతల ప్రదేశమైన అంటార్కిటికాలో ఈ విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటం … పర్యావరణ మార్పులపై ఆందోళనలను మరింతగా పెంచుతోంది.

ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ అయిన వరల్డ్ మెటీరోలాజియల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంఓ) కొత్తగా నమోదైన ఉష్ణోగ్రతలను ఇంకా ధృవీకరించనప్పటికీ, వేగవంతమైన ప్రపంచ తాపన కారణంగా ఇలాంటి అధిక ఉష్ణోగ్రతలు తరచుగా సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. అంటార్కిటికాలో గత 50 ఏళ్లలో ఉష్ణోగ్రతలు దాదాపు 3 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి.