Amaravati Capital: అమరావతిలో మళ్ళీ టెన్షన్.. కారణం పవన్‌కల్యాణ్

Tension situation in Amaravati capital area villages: అమరావతి ప్రాంతంలో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడుతోంది. సుమారు 60 రోజులుగా రాజధానిపై ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నా.. ఇటీవల కాలంలో పెద్ద నాయకుల రాకపోకలు తగ్గిపోవడంతో సాధారణ స్థితికి చేరుతున్నట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో శనివారం నాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటించేందుకు రెడీ అవుతున్నారు. శనివారం ఉదయాన్ని మంగళగిరికి చేరుకుని, ఆ తర్వాత రాజధాని గ్రామాల్లో పర్యటనకు వెళుతున్నారాయన. అమరావతి […]

Amaravati Capital: అమరావతిలో మళ్ళీ టెన్షన్.. కారణం పవన్‌కల్యాణ్
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 14, 2020 | 5:38 PM

Tension situation in Amaravati capital area villages: అమరావతి ప్రాంతంలో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడుతోంది. సుమారు 60 రోజులుగా రాజధానిపై ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నా.. ఇటీవల కాలంలో పెద్ద నాయకుల రాకపోకలు తగ్గిపోవడంతో సాధారణ స్థితికి చేరుతున్నట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో శనివారం నాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటించేందుకు రెడీ అవుతున్నారు. శనివారం ఉదయాన్ని మంగళగిరికి చేరుకుని, ఆ తర్వాత రాజధాని గ్రామాల్లో పర్యటనకు వెళుతున్నారాయన.

అమరావతి ఏరియాలోని పలు గ్రామాల్లో రైతులు, మహిళలు పలు చోట్ల నిరాహార దీక్షా శిబిరాలను కొనసాగిస్తున్నారు. తరచూ చిన్నా, చితకా కార్యక్రమాలతో ప్రభుత్వానికి తమ అభిమతాన్ని తెలియజెప్పేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం పర్యటించనున్న పవన్ కల్యాణ్.. దీక్షా శిబిరాలలో వున్న రైతులకు సంఘీభావం తెలుపనున్నారు. ఉదయం మంగళగిరిలోని జనసేన కార్యాలయం నుంచి పవన్ కల్యాణ్ బయలుదేరి.. యర్రబాలెం, పెనుమక, రాయపూడి, తుళ్లూరు గ్రామాల్లో పర్యటిస్తారు. అనంతవరం వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు పర్యటించనున్న పవన్ కల్యాణ్ వెంట నడిచేందుకు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. గతంలో పోలీసుల దాడిలో గాయపడిన రైతులను పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. రైతుల కోరిక మేరకే ఆయన ఈ పర్యటనకు పూనుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.

Also read: Kishanreddy anger on Hyderabad metro rail authorities

జనసేన భారీ ఎత్తున ఈ సందర్శన కార్యక్రమం చేపట్టడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పవన్ కల్యాణ్ పర్యటిస్తారని చెబుతున్న రూట్లలో భారీ ఎత్తున బలగాలను మోహరిస్తున్నారు. మొన్నటి వరకు తొలగిస్తూ వచ్చిన పోలీసు పికెట్లను తిరిగి ఏర్పాటు చేస్తున్నారు. దాంతో రాజధాని ప్రాంత గ్రామాలు మళ్ళీ టెన్షన్ వాతావరణంలోకి చేరుతున్నాయి. ఇంతకీ పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతుందా? దానికి పోలీసులు అనుమతిస్తారా అన్నదిపుడు చర్చనీయాంశంగా మారింది.