కాళేశ్వరం ప్రాజెక్టును స్వాగతిస్తున్నా : జగ్గారెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ఏపీ సీఎం జగన్‌, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌లను ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించడంలో తప్పులేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును స్వాగతిస్తున్నానని, కేసీఆర్ అనుకున్నది సాధించి చూపారన్నారు జగ్గారెడ్డి. కాగా.. సింగూర్, మంజీరా, సంగారెడ్డి, మహబూబ్‌ సాగర్ చెరువులలో ఏడాదిలోగా కాలువలు తవ్వించి నింపితే సీఎం కేసీఆర్‌కు సంగారెడ్డి జిల్లా ప్రజల తరుపున నేను సన్మానం చేస్తానని పేర్కొన్నారు. ఏ […]

కాళేశ్వరం ప్రాజెక్టును స్వాగతిస్తున్నా : జగ్గారెడ్డి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 19, 2019 | 4:52 PM

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ఏపీ సీఎం జగన్‌, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌లను ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించడంలో తప్పులేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును స్వాగతిస్తున్నానని, కేసీఆర్ అనుకున్నది సాధించి చూపారన్నారు జగ్గారెడ్డి. కాగా.. సింగూర్, మంజీరా, సంగారెడ్డి, మహబూబ్‌ సాగర్ చెరువులలో ఏడాదిలోగా కాలువలు తవ్వించి నింపితే సీఎం కేసీఆర్‌కు సంగారెడ్డి జిల్లా ప్రజల తరుపున నేను సన్మానం చేస్తానని పేర్కొన్నారు. ఏ సర్కార్ హయాంలోనైనా ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు జరిగితే హర్షించాల్సిందేనని జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ‘తెలంగాణ’ ఇచ్చింది కాబట్టే కేసీఆర్ కాళేశ్వరం కట్టారని ఆయన వ్యాఖ్యానించారు.