బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జేపీ నడ్డా!

భారతీయ జనతా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డాను నియమిస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది. జాతీయాధ్యక్షుడిగా మరికొన్నాళ్లు అమిత్ షా కొనసాగుతారని బోర్డు స్పష్టం చేసింది. జేపీ నడ్డా గత ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేశారు. ఈ ఏడాది చివరన జాతీయాధ్యక్షుడిగా అమిత్ షా పదవీకాలం ముగిసిన తర్వాత నడ్డాకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇకపోతే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జేపీ […]

  • Ravi Kiran
  • Publish Date - 8:36 pm, Mon, 17 June 19
బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జేపీ నడ్డా!

భారతీయ జనతా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డాను నియమిస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది. జాతీయాధ్యక్షుడిగా మరికొన్నాళ్లు అమిత్ షా కొనసాగుతారని బోర్డు స్పష్టం చేసింది. జేపీ నడ్డా గత ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేశారు. ఈ ఏడాది చివరన జాతీయాధ్యక్షుడిగా అమిత్ షా పదవీకాలం ముగిసిన తర్వాత నడ్డాకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇకపోతే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జేపీ నడ్డా పని చేయనున్నారు.