AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవంబర్ 6న అంతరిక్షంలోకి పీఎస్‌ఎల్‌వీ- సీ 49..!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాది తొలి ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి నవంబర్ 6న ప్రయోగించేందుకు ఫ్లాన్ చేస్తోంది.

నవంబర్ 6న అంతరిక్షంలోకి పీఎస్‌ఎల్‌వీ- సీ 49..!
Balaraju Goud
|

Updated on: Oct 28, 2020 | 8:14 PM

Share

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాది తొలి ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి నవంబర్ 6న ప్రయోగించేందుకు ఫ్లాన్ చేస్తోంది. పీఎస్‌ఎల్‌వీ- సీ 49 రాకెట్ భూ పరిశీలన నిఘా ఉపగ్రహం రిశాట్ -2 బీఆర్2తో పాటు పది విదేశీ వాణిజ్య ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. ప్రయోగంలో ఏదైనా ఆలస్యమైతే 7, 8 తేదీల్లో నిర్వహించాలని ఇస్రో నిర్ణయించింది. కొవిడ్-19 మహమ్మారి అనంతరం ఇస్రో ఈ ఏడాది చేపట్టనున్న మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగం ఇదే. మార్చి నుంచి అన్ని అంతరిక్ష కార్యకలాపాలు నిలిచిన ఇస్రో మరోసారి పరిశోధనలను ముమ్మరం చేసింది. డిసెంబర్ నాటికి కొత్త రాకెట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్‌వీ) పరీక్షించేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది.

రిశాట్-2 బీఆర్2 శాటిలైట్‌ భూమి పరిశీలనకు ఉపయోగపడనుంది. సింథటిక్ ఎపర్చర్ రాడార్ వ్యవస్థ ద్వారా ఏ వాతావరణ పరిస్థితుల్లోనా భూమిని నిశితంగా పరీక్షించవచ్చు. చైనాతో ఎల్‌ఏసీ వెంట నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తల మధ్య డ్రాగన్‌ ఎత్తుగడలను తెలుసుకునేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉండనుందని ఇస్రో అధికారులు భావిస్తున్నారు. అలాగే, నిఘాతో పాటు వ్యవసాయం, అటవీ, నేల తేమ, భూగర్భశాస్త్రం, తీర పర్యవేక్షణ, వరదలను పరిశీలించేందుకు ఈ ఉపగ్రహం ద్వారా పర్యవేక్షించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మిషన్‌ పూర్తయిన వెంటనే డిసెంబర్‌లో జీశాట్‌-12 ఆర్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్షలో పెట్టేందుకు పీఎస్‌ఎల్‌వీ-సీ 50 మిషన్‌ను చేపట్టాలని ఇస్రో భావిస్తోంది.

Follow Us