బ్రేకింగ్: మాజీ మంత్రి గంటా ఆస్తుల వేలానికి రంగం సిద్దం..!

మాజీ మంత్రి, టీడీపీ నేత..గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి రంగం సిద్దమైందా..అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.  దీనిపై ఇండియన్ బ్యాంక్ ఇప్పటికే బహిరంగ నోటీసు విడుదల చేసింది. గతంలోనూ ఈ సీనియర్ ఉత్తరాంధ్ర నేతపై ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. కానీ వాటిని ఆయన ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా డిసెంబర్ 20 న గంటా ఆస్తుల వేలానికి ఇండియన్ బ్యాంక్ ఫిక్సయినట్టు సమాచారం. వేలానికి రానున్న ఆస్తుల్లో ఎమ్మెల్యే గంటా పేరిట ఉన్న విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని ఫ్లాట్ […]

బ్రేకింగ్: మాజీ మంత్రి గంటా ఆస్తుల వేలానికి రంగం సిద్దం..!

మాజీ మంత్రి, టీడీపీ నేత..గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి రంగం సిద్దమైందా..అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.  దీనిపై ఇండియన్ బ్యాంక్ ఇప్పటికే బహిరంగ నోటీసు విడుదల చేసింది. గతంలోనూ ఈ సీనియర్ ఉత్తరాంధ్ర నేతపై ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. కానీ వాటిని ఆయన ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా డిసెంబర్ 20 న గంటా ఆస్తుల వేలానికి ఇండియన్ బ్యాంక్ ఫిక్సయినట్టు సమాచారం. వేలానికి రానున్న ఆస్తుల్లో ఎమ్మెల్యే గంటా పేరిట ఉన్న విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని ఫ్లాట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రత్యూషా రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో.. సదరు బ్యాంక్ నుంచి గతంలో భారీ రుణం తీసుకున్నారు గంటా. కానీ వాటిని తిరిగి చెల్లించడంలో మాత్రం అలసత్వం వహించారు. బ్యాంకు పలుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికి..ఆయన నుంచి రెస్పాన్స్ రాలేదని సమాచారం. దాదాపు రూ. 200 కోట్లకు పైగా గంటా..బ్యాంకుకు బాకీ పడినట్లు తెలుస్తోంది. తనఖా పెట్టిన ఆస్తుల విలువ 35 కోట్ల 35 లక్షల 61 వేలు మాత్రమే ఉన్నట్లుగా సమాచారం. మరి ఈ న్యూస్‌పై గంటా ఎలా స్పందిస్తారన్నది వేచిచూడాలి.