Irfan Pathan: ఇంటర్‏పోల్ ఆఫీసర్‏గా మారిన ఇర్ఫాన్ పఠాన్.. విక్రమ్ ప్రత్యర్థి పాత్రలో మాజీ క్రికెటర్..

విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కోబ్రా. ఆర్. అజయ్ జ్ఞానముత్తు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్

Irfan Pathan: ఇంటర్‏పోల్ ఆఫీసర్‏గా మారిన ఇర్ఫాన్ పఠాన్.. విక్రమ్ ప్రత్యర్థి పాత్రలో మాజీ క్రికెటర్..
Follow us
Rajitha Chanti

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 09, 2021 | 7:47 PM

విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కోబ్రా. ఆర్. అజయ్ జ్ఞానముత్తు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా శనివారం ఈ మూవీకి సంబంధించిన టీజర్‏ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ మూవీ టీజర్ చూస్తూంటే సినిమా పై అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి. ఇక ఇందులో విక్రమ్ 20 రకాల గెటప్‏లలో కనిపించనున్నాడని టాక్. అంతేకాకుండా ఈ సినిమా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రతినాయుకుడిగా కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీలో ఆయన నటించే పాత్రకు సంబంధించిన విషయాల గురించి ఇర్ఫాన్ స్పందించారు. ఇందులో ఆయన ఇంటర్‏పోల్ ఆఫీసర్‏గా నటిస్తు్న్నారు. కోల్‏కత్తాలో షూటింగ్ తీసిన ఫోటోలను ఆయన అభిమానులతో పంచుకున్నారు. కోల్‏కత్తాలో ఇంటర్ పోల్ ఆఫీసర్ ఏం చేస్తున్నారు ? అని క్యాప్షన్ ఇచ్చారు. సినిమా పరిశ్రమలో పలు విజయాలను సొంతం చేసుకొని విక్రమ్ స్టార్ అయ్యారు. కానీ ఇప్పటికీ ఆయన చాలా సింపుల్‏గా ఉంటారు. అదే ఆయనలో నాకు నచ్చే గుణం. సెట్స్‏లో ఆయన్ను కలిసిన ప్రతిసారీ సమయం అలా గడిపోతుండేది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Also Read: డిసెంబర్ నుంచి ‘కోబ్రా’ షూటింగ్ .. డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్న చియాన్ విక్రమ్