డిసెంబర్ నుంచి ‘కోబ్రా’ షూటింగ్ .. డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్న చియాన్ విక్రమ్

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ఇటీవల చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో . ఈ సారి సాలిడ్ హిట్ కొట్టాలని కసిమీద ఉన్నాడు…

  • Rajeev Rayala
  • Publish Date - 10:45 am, Sat, 28 November 20

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ఇటీవల చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో . ఈ సారి సాలిడ్ హిట్ కొట్టాలని కసిమీద ఉన్నాడు. ప్రస్తుతం అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ‘కోబ్రా’అనే సినిమా చేస్తున్నాడు విక్రమ్.ఇటీవల రిలీజైన టైటిల్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.’కోబ్రా’ఫస్ట్ లుక్ అభిమానుల్లో జోరుగా వైరల్ అయ్యింది.
ఇక ఈ సినిమాలో విక్రమ్ ఏడు గెటప్పుల్లో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇటీవల విక్రమ్ ఏడు కాదు ఏకంగా 20 గెటప్పుల్లో కనిపించనున్నాడని ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఈ సినిమా తమిళం- తెలుగు- హిందీ సహా పలు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఇందులో కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ డిసెంబర్ నుంచి ‘కోబ్రా’ షూటింగ్ తిరిగి ప్రారంభమవుతోందని సమాచారం. డిసెంబర్ లో మొదలు పెట్టి శరవేగంగా షూటింగ్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.