కరోనాతో చనిపోతే బీమా పరిహారం ఇవ్వాల్సిందే.. జీవిత బీమా మండలి ఆదేశం..

కరోనా కరాళ నృత్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇపుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కొవిడ్‌-19తో చనిపోయిన వారి క్లైమ్స్‌ను అత్యంత వేగంగా పరిష్కరించాలని బీమా సంస్థలకు జీవిత బీమా మండలి సోమవారం స్పష్టం చేసింది.

కరోనాతో చనిపోతే బీమా పరిహారం ఇవ్వాల్సిందే.. జీవిత బీమా మండలి ఆదేశం..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 06, 2020 | 3:54 PM

కరోనా కరాళ నృత్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇపుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కొవిడ్‌-19తో చనిపోయిన వారి క్లైమ్స్‌ను అత్యంత వేగంగా పరిష్కరించాలని బీమా సంస్థలకు జీవిత బీమా మండలి సోమవారం స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పరిష్కార ప్రక్రియను వేగంగా చేపట్టాలని సూచించింది. కొవిడ్‌-19 డెత్‌ క్లైమ్స్‌కు ‘ఫోర్స్‌ మెజర్‌’ నిబంధన వర్తించదని వెల్లడించింది. ముందుగా తెలియని, నియంత్రించలేని పరిస్థితులకు ‘ఫోర్స్‌ మెజర్‌’ను అమలు చేస్తారు. కరోనాకు దీనిని వర్తింపజేయడం లేదని జీవిత బీమా మండలి తెలిపింది.తమ వినియోగదారులకు ఈ విషయం వ్యక్తిగతంగా వెల్లడించాలని బీమా సంస్థలకు మండలి ఆదేశించింది.

ప్రపంచ మహమ్మారి కొవిడ్‌-19 ఇంట్లో ప్రతి ఒక్కరికి జీవిత బీమా ప్రాథమిక అవసరమని నొక్కిచెబుతోంది. లాక్‌డౌన్‌ వల్ల వినియోగదారులకు కలిగిన అంతరాయాన్ని తగ్గించేందుకు జీవిత బీమా రంగం అన్ని చర్యలూ తీసుకుంటోంది. ఈ సంక్లిష్ట సమయంలో కొవిడ్‌-19 డెత్‌ క్లైమ్స్‌ సహా ఎన్నో సేవలను డిజిటల్‌ రూపంలో అందజేస్తున్నాం.. అని జీవిత బీమా మండలి సెక్రెటరీ జనరల్‌ ఎస్‌ఎన్‌ భట్టాచార్య తెలిపారు. ఏప్రిల్‌ నెలలో జీవిత బీమా పాలసీల ప్రీమియం చెల్లించే వినియోగదారులకు మరో 30 రోజులు అదనపు సమయం ఇస్తున్నామని ఐఆర్‌డీఏఐ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి విదితమే.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..