Coronavirus: కరోనాతో భారత్‌లో పరిస్థితి దారుణంగా ఉంది.. ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌వో

Tedros Adhanom: భారత్‌లో పెరుగుతున్న కరోనా సెకండ్‌ వేవ్‌ పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్‌ ఎంత తీవ్రంగా ఉంటుందో సెకండ్‌ వేవ్‌ గుర్తు చేస్తుందని..

Coronavirus: కరోనాతో భారత్‌లో పరిస్థితి దారుణంగా ఉంది.. ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌వో
Tedros Adhanom
Follow us

|

Updated on: Apr 24, 2021 | 8:43 PM

Tedros Adhanom: భారత్‌లో పెరుగుతున్న కరోనా సెకండ్‌ వేవ్‌ పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్‌ ఎంత తీవ్రంగా ఉంటుందో సెకండ్‌ వేవ్‌ గుర్తు చేస్తుందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్ అథనామ్ అన్నారు. జెనీవాలో జరిగిన వర్చువల్‌ బ్రీఫింగ్‌ సందర్భంగా ఆక్సిజన్‌ కొరత, ఆస్పత్రుల్లో బెడ్స్‌ కొరత, రమ్‌డెసివిర్‌ వంటి ప్రధాన అత్యవసర ఔషధాల కొరత కారణంగా భారత్‌లో ప్రతి రోజు రోజు పరిస్థితి చేతులెత్తేస్తున్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు.

25 నుంచి 59 ఏళ్ల మధ్య వయసులో ఇన్‌ఫెక్షన్‌ వేగంగా పెరిగిపోతోందని ఆయన చెప్పారు ప్రపంచ వ్యాప్తంగా మరింత వేగంగా టీకాలు వేయడం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆగ్నేయాసియాలో ఇన్‌ఫెక్షన్‌ మరణాల సంఖ్యను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మరో వైపు అనేక దేశాల్లో ఉన్న భారతీయ మిషన్లు అక్కడ ప్రభుత్వాలు, సంస్థలతో ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌తో పాటు ఇతర ఔషధాల కోసం చర్చలు జరుపుతున్నాయి. యూఏఈ, సింగపూర్‌, మరికొన్ని ఆగ్నేయాసియా దేశాల నుంచి ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రష్యా కూడా ఆక్సిజన్‌ సరఫరాకు సహాయం చేయడానికి ముందుకొచ్చింది.

అలాగే భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో పెరుగుతున్న కేసుల పట్ల అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. పొరుగు దేశం పాక్‌ కూడా తాజాగా సంఘీభావం ప్రకటించింది. భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులను అనుమతించమని ఇప్పటికే పలు దేశాలు ప్రకటించాయి. భారత్‌లో కరోనా పరిస్థితులపై అంతర్జాతీయ మీడియా కూడా జోరుగా కథనాలు ప్రచురిస్తోంది. వాషింగ్టన్‌ పోస్టు, న్యూయార్క్‌ టైమ్స్‌, ఏబీసీ వంటి సంస్థలు భారత్‌లోని పరిస్థితులపై పలు వార్తలు ప్రచురించాయి. భారత్‌లో కరోనా వ్యాప్తికి గల కారణాలపై విశ్లేషిస్తున్నాయి.

ఇవీ చదవండి: భారత్‌లో సెకండ్‌వేవ్‌ కరోనా వ్యాప్తిపై అంతర్జాతీయ మీడియా విశ్లేషణ.. కరోనా వ్యాప్తికి గల కారణాలేంటో తెలిపిన విదేశీ పత్రికలు

Johnson & Johnson: జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా టీకాపై నిషేధం ఎత్తివేత.. ప్రకటించిన అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ