దారుణం.. IAF అధికారి భార్యపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్.. చివరకు బలవంతపు మతమార్పిడి!
24 ఏళ్ల ఐఏఎఫ్ అధికారి భార్యపై అత్యాచారం చేయడమే కాక, ఆ దృశ్యాలను రికార్డు చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి, ఆ తర్వాత ఆమెను బలవంతంగా మతమార్పిడి చేసిన వ్యక్తిపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే..

నాగ్‌పూర్, జూన్ 17: వివాహితపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్, దోపిడీ ఆరోపణలపై చేసిన వీడియో బయటకు రావడంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే బాధితురాలు ఏకంగా ఐఏఎఫ్ అధికారి భార్య కావడం విశేషం. ఐఏఎఫ్ అధికారి భార్యపై అత్యాచారం చేయడమే కాక, ఆ దృశ్యాలను రికార్డు చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి, ఆ తర్వాత ఆమెను బలవంతంగా మతమార్పిడి చేసిన వ్యక్తిపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే..
24 ఏళ్ల బాధిత మహిళ భర్త నాగ్‌పూర్ వెలుపల ఐఏఎఫ్ అధికారిగా పనిచేస్తున్నాడు. ఆ మహిళ నాగ్‌పూర్ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. చిన్నతనంలో పాఠశాల రోజుల నుంచి పరిచయస్తుడైన అయ్యాజ్ తాజే మదారే ఆమెకు వ్యాపారంలో సహాయం చేసేవాడు. గత ఏడాది ఫిబ్రవరిలో ఒక రోజు బాధిత మహిళను అయ్యాజ్ తాజే ఓ హోటల్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ అతడు బాధితురాలికి మత్తుమందు కలిపిన డ్రింక్ తాగించాడు. ఆమె స్పృహ కోల్పోవడంతో ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆమె ఫొటోలు, అభ్యంతరకరమైన వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. నిందితుడు ఆమెను బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి ఆ వీడియోలను ఉపయోగించాడు.
ఇలా ఆమె వద్ద దాదాపు రూ.4 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత మే 31న ఆమెను మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాకు తీసుకువెళ్లి మరోమారు మత్తు ప్రయోగం చేసి బలవంతంగా మత మార్పిడీ తతంగాన్ని నిర్వహించి, పెళ్లి చేసుకునేందుకు యత్నించాడు. దీంతో బాధితురాలు భర్తకు ఈ విషయం చెప్పి సోనెగావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి.. అయ్యజ్ తాజ్ మదారే (26), ఆమిన్ షేక్ (30)లను అరెస్ట్ చేశారు. మూడో నిందితుడు జ్రత్ మౌలానా పరారీలో ఉన్నాడు. దీనిపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రుషికేష్ సింగారెడ్డి మాట్లాడుతూ నిందితులలో ఇద్దరిని అరెస్టు చేశాం, మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో మూడో నిందితుడి కోసం గాలిస్తున్నాం. మొబైల్ ఫోన్ల నుంచి డిజిటల్ ఆధారాలు కూడా సేకరించి, వీడియోలను విశ్లేషిస్తున్నామని తెలిపారు. ఈ ఘటన జరిగి ఏడాది అయినందున మరికొంతమంది బాధితులు ముందుకు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.




