రాష్ట్రంలో ఎవరున్నా… ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతా: రాహుల్‌

తిరుపతి: రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. తాను ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతానని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. తిరుపతిలో తారకరామ మైదానంలో కాంగ్రెస్‌ భరోసా యాత్ర నిర్వహించింది. ఈ సందర్భంగా బహిరంగ సభను నిర్వహించారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న మునికోటికి రాహుల్‌ నివాళి అర్పించారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ ‘‘మోదీ.. ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి తప్పారు. ప్రత్యేక హోదా కేవలం ప్రధాని ఇచ్చిన వాగ్దానం కాదు.. దేశంలోని […]

  • Ram Naramaneni
  • Publish Date - 6:37 pm, Fri, 22 February 19
రాష్ట్రంలో ఎవరున్నా... ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతా: రాహుల్‌
తిరుపతి: రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. తాను ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతానని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. తిరుపతిలో తారకరామ మైదానంలో కాంగ్రెస్‌ భరోసా యాత్ర నిర్వహించింది. ఈ సందర్భంగా బహిరంగ సభను నిర్వహించారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న మునికోటికి రాహుల్‌ నివాళి అర్పించారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ ‘‘మోదీ.. ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి తప్పారు. ప్రత్యేక హోదా కేవలం ప్రధాని ఇచ్చిన వాగ్దానం కాదు.. దేశంలోని ప్రతిపౌరుడు ఏపీకి ఇచ్చిన వాగ్దానంగా భావిస్తున్నాం. ప్రధాని ఒక వ్యక్తి కాదు.. కోట్లాది మందికి ప్రతినిధి. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రపంచంలో.. ఏ శక్తి కూడా ప్రత్యేక హోదాను అడ్డుకోలేదు’’ అని రాహుల్ చెప్పారు.
మోదీ ఇప్పటి వరకు ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదని రాహుల్‌ ధ్వజమెత్తారు. రాఫెల్‌ విషయంలో అంబానీకి రూ.30 వేల కోట్లు దోచిపెట్టారని, కాపలాదారుడే దొంగ అని ప్రజలు అంటున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ సత్యాలే చెబుతుందని స్పష్టం చేశారు. 2013 భూసేకరణ చట్టాన్ని కాంగ్రెస్‌ తీసుకొచ్చిందని, తమ హయాంలో రూ.70 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని తెలిపారు. మోదీ పారిశ్రామిక వేత్తలకు రుణమాఫీ చేశారని, రైతులకు మాత్రం రుణమాఫీ చేయడం లేదని ఆయన దుయ్యబట్టారు. చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో రెండ్రోజుల్లో రుణమాఫీ చేశామని, కాంగ్రెస్‌ మాట మీద నిలబడే పార్టీ అని మరోసారి రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు.