అలా చేస్తే పాకిస్థాన్‌కు లొంగిపోయినట్టే: శశి థరూర్

న్యూఢిల్లీ: వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడకపోతే భారత్ లొంగిపోయినట్టేనని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ అన్నారు. మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేయడం వల్ల టీమిండియా ఓటమిని అంగీకరించినట్లు అవుతుందని, దాని వల్ల జట్టుకు, దేశానికి ఒరిగేదేమీ లేదని ఆయన అభిప్రాయపడుతూ ట్వీట్‌ చేశారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడొద్దనే డిమాండ్ పెరుగుతోంది. త్వరలో జరగనున్న క్రికెట్ ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో భారత జట్టు ఆడకూడదని పలువురు అంటున్నారు. హర్భజన్ సింగ్, అజారుద్దీన్ […]

అలా చేస్తే పాకిస్థాన్‌కు లొంగిపోయినట్టే: శశి థరూర్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:36 PM

న్యూఢిల్లీ: వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడకపోతే భారత్ లొంగిపోయినట్టేనని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ అన్నారు. మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేయడం వల్ల టీమిండియా ఓటమిని అంగీకరించినట్లు అవుతుందని, దాని వల్ల జట్టుకు, దేశానికి ఒరిగేదేమీ లేదని ఆయన అభిప్రాయపడుతూ ట్వీట్‌ చేశారు.

పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడొద్దనే డిమాండ్ పెరుగుతోంది. త్వరలో జరగనున్న క్రికెట్ ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో భారత జట్టు ఆడకూడదని పలువురు అంటున్నారు. హర్భజన్ సింగ్, అజారుద్దీన్ పాక్‌తో మ్యాచ్ ఆడకుంటే కొంపలేం మునిగిపోవని అంటున్నారు. అయితే ఆడకుంటే భారత్‌కే నష్టమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బీసీసీఐ అధికారులు, ప్రభుత్వ వర్గాలు, సునీల్‌ గావస్కర్‌, తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతశశి థరూర్‌ ఆ జాబితాలో ఉన్నారు.

1999లో కార్గిల్‌ యుద్ధ సమయంలో జరిగిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌‌లో మనమే గెలిచాం. ఇప్పుడు కూడా ఆడి గెలవాలి. పాక్‌తో ఆడకపోతే వాళ్లకు లొంగిపోవడం కంటే దారుణం. పోరాటం చేయకుండానే ఓడిపోయినట్లు అవుతుందంటూ థరూర్‌ అన్నారు.

ప్రపంచకప్‌లో భారత్-పాక్ మధ్య జూన్‌16న మాంచెస్టర్‌‌లో మ్యాచ్‌ జరగనుంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..